హ్యాట్సాఫ్ : తానెవరో చెప్పకుండా వారం రోజులు వాలంటీర్ గా సేవలందించిన ఐఏఎస్ అధికారి.. రియల్ హీరో అంటూ పొగుడుతున్న నెటిజన్లు.

ఎవరైనా బనానా చిప్స్ బాక్స్ లో పెట్టిస్తే ఖాళీ డబ్బా ఇవ్వకుండా తిరిగి ఆ బాక్స్ నిండా ఏదైనా పెట్టిచ్చేవాళ్లం.ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కేరళకు వచ్చింది.

 Man Worked As Volunteer For Kerala Flood Relief But He Was An Ias-TeluguStop.com

కాబట్టి రండి సాయం చేద్దాం అంటూ టివిలో వచ్చే యాడ్ అందరిని కట్టిపడేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాళీలు కేరళకు సాయం చేయాలని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే కోరిన విషయం తెలిసిందే.

నిన్న మొన్న వరదలకు అతలాకుతలం అయిన కేరళను ఆదుకోవడానికి అందరూ ముందుకొస్తున్నారు.మళయాళిలయితే కష్టాల్లో ఉన్న కన్నభూమి కోసం కంటతడి పెట్టుకోవడమే కాదు ఏదో ఒక సాయం చేస్తున్నారు.

అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పని కొంచెం లేట్ గా వార్తల్లోకి వచ్చింది.ఇంతకీ తానెవరు.ఏం చేశారు…

కన్నన్ గోపీనాథన్ 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్.ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు.కేరళకు చెందిన ఆయన.సొంత రాష్ట్రం కష్టాల్లో ఉండడంతో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దాద్రా నగర్ హవేలీ తరఫున కోటి రూపాయల విరాళం అందించాడు.వాస్తవానికి అక్కడితో తన పని పూర్తైంది.కానీ కన్నన్ అక్కడితో ఆగిపోకుండా సొంత రాష్ట్రానికి పయనమయ్యాడు.అక్కడికి చేరుకోగానే వాలంటీర్‌గా పని చేస్తూ.పునరావాస కేంద్రాల వద్ద ట్రక్కుల నుంచి సామాన్లు దింపుతూ సాయపడ్డాడు.8 రోజులపాటు అతడు కొచ్చిలో అందరికీ చేదోడు వాదోడుగా నిలిచాడు.కానీ తొమ్మిదో రోజు ఓ సీనియర్ అధికారి గోపీనాథన్‌ను నిశితంగా పరిశీలించి గుర్తుపట్టాడు.

సార్ మీరు ఇక్కడేంటని ప్రశ్నించాడు…ఇలాంటి ఘటనలు ఎక్కువగా మనం సినిమాల్లో చూస్తుంటాం.

కానీ సొంత ప్రజలు కష్టాల్లో ఉండటం చూసి సాటి మలయాళీగా ఆయన చలించిపోయాడు.

సొంతూరు వెళ్లి విశ్రాంతి తీసుకోకుండా.వరద తీవ్రత ఎక్కువగా ఉన్న చెన్నగన్నూర్ లాంటి ప్రాంతాలకు వెళ్లి వాలంటీర్‌గా సహాయక చర్యల్లో పాలు పంచుకున్నాడు.

తనెవరో తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.కానీ ఓ అధికారి గుర్తించడంతో ఆయనెవరో తెలిసిపోయింది.

విషయం బయటికి తెలియడంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.వాలంటీర్‌గా పని చేయడం గురించి గోపీనాథన్ మాట్లాడుతూ.

ఇక్కడి అధికారులు పడిన శ్రమతో పోలిస్తే.నేనేం గొప్ప పని చేయలేదని వినయంగా చెప్పుకొచ్చాడు.

నన్ను హీరో చేయొద్దు, క్షేత్ర స్థాయిలో ఇక్కడెంతో మంది సాయం చేస్తున్నారు.వారే రియల్ హీరోలు.

ఇదే స్ఫూర్తితో అంతా కష్టపడితే.త్వరలోనే కేరళ కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తనవెరో తెలిసిపోవడంతో ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.9 రోజులపాటు లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.కానీ ఆయన చేసిన పనుల గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు.ఆయన కేరళ టూర్‌ను అధికారిక పర్యటనగా గుర్తించారు.నిజంగా ఎలాంటి గుర్తింపు కోసం తాపత్రయపడకుండా నిస్వార్ధంగా సేవ చేసిన కన్నన్ రియల్ హీరో అయ్యారు.కణ్ణన్ ను సోషల్ మీడియా అంతా వేనోళ్ల పొగుడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube