అమ్మాయిలు, అబ్బాయిలు .. ఫ్లర్టింగ్ వలన కలిగే లాభాలు  

Advantages Of Flirting -

ఫ్లర్టింగ్ … గత 10-15 సంవత్సరాల్లో బాగా ప్రాచుర్యం పొందిన పదం ఇది.అమ్మాయిని అందంగా ఉన్నావని పొగుడుతారు కాని పక్కనుంచి మరో అందమైన అమ్మాయి వెళితే చూడకుండా ఉండలేరు, గంటలకొద్ది కబుర్లు పెడతారు కాని ఆ అమ్మాయే తన ప్రపంచం కాదు, గిల్లుతారు కాని రెచ్చగొట్టాలని కాదు, అదో సరదా.

కవిత్వం కూడా చెబుతారు, కాని ఎక్కడినుంచో లైన్లు కొట్టేసి.సింపుల్ గా చెప్పాలంటే, స్వచ్ఛమైన ఫీలింగ్స్, బాధ్యత లేని రిలేషన్ షిప్ ఈ ఫ్లర్టింగ్.ఇంకోరకంగా చెప్పాలంటే ఉత్తుత్త ప్రేమ.ఈ టైమ్ పాస్ ప్రేమ మోసం చేయనంతవరకు చాలా సరదాగా చిలిపిగా ఉంటుంది.

Advantages Of Flirting-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇవాళ రేపు, ముందే ఫ్లర్ట్ చేస్తున్నాం, ప్రేమించట్లేదు అని చెప్పేసి మరి ఫ్లర్ట్ చేస్తున్నారు.ఈ ఫ్లర్టింగ్ వలన చాలా లాభాలున్నాయి.

* ఫ్లర్టింగ్ వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ఒక అబ్బాయితో అమ్మాయి, ఒక అమ్మాయితో అబ్బాయి ఎంతో సరదాగా గడుపుతారు.కాబట్టి మాటలు ఎలా అల్లాలో, ఒకరిని ఎలా నవ్వించాలో ఫ్లర్టింగ్ నేర్పిస్తుంది.

* ఫ్లర్టింగ్ వలన, ఎలాంటి సమయాల్లో అమ్మాయిలు ఎలా అలోచిస్తారో, ఏ విషయానికి అబ్బాయి ఎలా స్పందిస్తారో గమనించే అవకాశం ఉంటుంది.

ఈ ప్రాసెస్ లో ఏదైనా తప్పు చేసి, అవతలివారి మనసుకి ఇబ్బంది కలిగించినా, నిజమైన ఫిలింగ్స్ లేవు కాబట్టి, త్వరగా మరచిపోతారు.

* ఫ్లర్టింగ్ సరదాగా సాగే పని, ప్రేమకథల్లో ఉన్నట్లు ఇందులో ఎమోషన్స్ ఉండవు, ఏడుపులు ఉండవు, గొడవలు ఉండవు, చీదరింపులు ఉండవు .హాయిగా, నవ్వుతూ, నవ్విస్తూ ఫ్లర్ట్ చేయోచ్చు.

* ఫ్లర్టింగ్ లో ఎదుటివ్యక్తి మనల్ని బాగా పొగుడుతాడు/పొగుడుతుంది.

ఇది మనలో ఉండే ఆందోళనలను, భయాలను పోగొడుతుంది.మనకి కూడా విలువనిచ్చే మనుషులు దొరుకుతారనే నమ్మకం కలుగుతుంది.

* ఫ్లర్టింగ్ లో బాధ్యత ఉండదు.టైమ్ కి మెసేజ్ చేయకపోయినా, మాట్లాడకపోయినా, ఇద్దరిలో ఎవరికి నొప్పి కలగదు.కాబట్టి ఈ టైమ్ పాస్ ప్రేమ బరువుగా అనిపించదు.

తాజా వార్తలు