మనం చిన్నప్పటి నుండి సరదాగా ఆడే గేమ్స్ లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే గేమ్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది.ఏమిటంటే మనం మన స్నేహితులతో కలిసి మీ నాలుక ను ఉపయోగించి ముక్కును అందుకోగలరా అనే ఆటను చాలా మంది ఆడే ఉంటారు.
కానీ ఎవ్వరో ఒకరు మాత్రమే ఈ గేమ్ లో విన్ అవుతారు.ఎందుకంటే అది అందరికి సాధ్యం కాదు.
మన నాలుక చిన్నగా ఉంటుంది.అందుకే మన నాలుకతో ముక్కును అంటుకోవడం కొద్దిగా కష్టమైన పనే.లక్షలో ఒకరో ఇద్దరో మాత్రమే ఇలా నాలుకతో ముక్కును అంటుకుంటారు.అయితే ఒక వ్యక్తి తన నాలుకతో ముక్కును అందుకోవడం మాత్రమే కాదు ఏకంగా కంటి వరకు తన నాలుకను చాప గలడు.
అది ఎలా సాధ్యం అని అనుకోవద్దు.అది నిజమో కాదో తెలియాలంటే ఈ వీడియోను చుస్తే సరి.
తమిళనాడు రాష్ట్రము విరుదునగర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే 20 సంవత్సరాల యువకుడు తన నాలుకతో తన కంటి వరకు అందుకోగలడు.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ యువకుడి నాలుక అందరిలా కాకుండా చాలా పొడవుగా ఉంటుందట.ఇతడి నాలుక 10.8 సెంటీ మీటర్ల పొడవు ఉందట.మాములుగా అయితే మగవారు నాలుక 8.5 సెంటీ మీటర్ల వరకు ఉంటుందట.
అంత పెద్దగా నాలుక ఉండడం చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.ఇప్పటి వరకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఉన్న వ్యక్తి నాలుక 10.1 సెంటీ మీటర్లు ఉంది.కానీ ఆ వ్యక్తి రికార్డును ప్రవీణ్ కుమార్ చెరిపే అవకాశం ఉంది.ఇతడు గత సంవత్సరం ఆసియా బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించాడు.ప్రవీణ్ మాట్లాడుతూ.తన పొడవైన నాలుక వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదన ఎదో ఒక రోజు కనుపాపలు కూడా తాకగలనని అతడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.