అలా ఉంటే అమ్మాయిలకు హాట్ గా కనిపిస్తారు అబ్బాయిలు

అదే ముఖం … హెయిర్ స్టయిల్ మారిస్తే ఓరకంగా కనబడుతుంది, గుండు చేయించుకుంటే మరోరకంగా కనబడుతుంది.మీసంతో ఓ రకంగా, మీసం లేకుండా ఓ రకంగా, గెడ్డంతో మరోరకంగా కనబడుతుంది.

 Man With Beard – Eye Candy For Girls-TeluguStop.com

మగవారి రూపు మీద ఈకాలం అమ్మాయిలకి భిన్న అభిప్రాయాలున్నాయి.అబ్బాయిలు ఎలా ఉంటే హాట్ గా ఉంటారో, ఎలా ఉంటే క్యూట్ గా ఉంటారో, ఎలా ఉంటే బాగుండరో డిసైడ్ చేసేస్తున్నారు.

ఒక హిందీ టివీ ఛానెల్ ముంబై రోడ్లపై అమ్మాయిలతో చిన్న సర్వే చేసింది.అబ్బాయిలు ఎలా ఉంటే హాట్ గా కనబడతారు అనే ప్రశ్నకు అందరి నుంచి ఒకే సమాధానం.

గెడ్డం పెంచితే అమ్మాయిల కంటికి అబ్బాయి కనిపించే విధానమే వేరట.అదోరకం సెక్సిగా కనిపిస్తారట గెడ్డం, మీసం రెండు పెంచితే.

అయితే కేవలం మీసం ఉంచితే మాత్రం ఒప్పుకోరంట అమ్మాయిలు.కేవలం మీసం పెంచే అబ్బాయిలని అంకుల్స్ కింద జమకట్టేసారు అమ్మాయిలు.

ఇక క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలు చాలా క్యూట్ గా కనిపిస్తారట.కాని అస్సలు సెక్సిగా కనిపించరట.

అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే క్లీన్ షేవ్ చాలు కాని, విపరీతంగా ఆకట్టుకోవాలంటే మాత్రం గెడ్డం పెంచాల్సిందే అని సెలవిచ్చారు అమ్మాయిలు.

ఇక మీ లుక్కు ఎలా మేయింటేన్ చేస్తారో మీ ఇష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube