ఆయనకి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.! అన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలుసా.?

జగమంత కుటుంబం ఆయనది.ఇంటి నిండా జనంతో నిండు జీవితం ఆయనది.

 Man With 39 Wives 94 Children And 33 Grandchildren-TeluguStop.com

ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం, నా ముఖానికి ఇంకొక భార్య అంటూ చాలామంది వేళాకోలంగా చెబుతుంటారు.అయితే, ఆయన ఏకంగా 39 మందిని పెళ్లి చేసుకుని, 94 మంది పిల్లలకు తండ్రయ్యాడు.

మిజోరమ్ రాష్ట్రం బక్తావంగ్ గ్రామంలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉంది.ఆ భవనం లో ఒకే ఫ్యామిలీకి చెందిన 181 మంది నివసిస్తున్నారు.వీరంతా 72 ఏళ్ల జియోనా కుటుంబానికి చెందిన సభ్యులు.ఆయనకు 39 భార్యలు.

వారి ద్వారా 94 మంది సంతానం.ఉన్నారు.14 మంది కొడుకులకు పెళ్లిళ్లు కూడా చేశారు.జియోనా కు 40 మంది మనువలు, మనవరాళ్ళు ఉన్నారు.

ఇంత మంది సభ్యులు కలిసి మెలసి.మొత్తం నాలుగు అంతస్తుల భవనం లో ఉంటారు.

అందరూ కలిసి వంటావార్పు చేసుకొంటారు.

1945లో పుట్టిన జియోనాకు 17వ ఏటనే వివాహం అయింది.

ఆయనకు ఇప్పుడు 39 మంది భార్యలు.చిన్న భార్య వయసు 38 ఏళ్లు.

ఒక ఏడాదిలో ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకున్నారు.క్రైస్తవ మతానికి చెందిన చానా తెగలో బహు భార్యత్వం ఉంది.

ఆయనకు నాలుగు అంతస్థుల భవనం, ఒక గెస్ట్‌ హౌస్‌ ఉంది.జియోనాకు ఇప్పుడు 70ఏళ్లు దాటాయి.

అందరూ భోజనానికి కూర్చోవాలంటే 39 కోళ్లు వండాలి.అందరూ అన్నం తినాలంటే కనీసం 50 కిలోల బియ్యం వండాలి.60 కిలోల బంగాళదుంపలు కూర ఉంటేనే పూట గడిచేది.ఇది ఒక కుటుంబం కథ.జియోనా తన భార్యలతో ఎలా గడుపుతాడని అందరికీ అనుమానం రావచ్చు.ఆయన మాత్రం అంత టెన్షన్ అవసరం లేదని, భార్యలే ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమయం కేటాయించుకుంటారని జియోనా అన్నారు.

జియోనా ఎవరినీ మోసగించి పెళ్లి చేసుకోలేదని, బహుభార్యత్వం తమ తెగలో మొదటి నుంచి ఉందని చెప్పారు.

ఇలా రోజుకు ఒక్కరు చొప్పున ఆయనతో పడుకుంటారు.

ఎనిమిది మంది భార్యలు ఆయన అవసరాలు తీర్చుతారు.చనా కుమారుల్లో కొంతమంది వ్యవసాయం చేస్తుంటే, మరికొందరు వ్యాపారం చేస్తున్నారు.

చనా కుటుంబంలోని పిల్లలు చదువుకోడానికి అక్కడ ఏకంగా ఒక స్కూలే ఉంది.అందులో మిజోరం స్టేట్ సిలబస్‌తో పాటు, చనా జీవిత చరిత్ర కూడా బోధిస్తుండటం గమనార్హం.

అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే.? అది తమ జాతి సంప్రదాయమని చెబుతున్నాడు మన 73 ఏళ్ల మిస్టర్ పెళ్లి కొడుకు.తన జాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఆయన ఈ పెళ్లి చేసుకుంటున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube