ఆకలికి తట్టుకోలేక మండే ఎండలో అతను ఇసుక తింటుంటే...వారు ఏం చేసారో తెలుసా.?

చేతిలో డబ్బులు లేక,ఏం చేయలేక దిక్కుతోచని స్థితిలో.ఆకలికి తట్టుకోలేక దొరికిన ఇసుకనే పంచభక్ష్య పరమాణ్నం అనుకుని తింటున్నాడో వ్యక్తి.

 Man Who Was Eating Out Of Hunger-TeluguStop.com

దారిన పోయే వారందరూ చూస్తున్నారు.కాని తమకెందుకులే అని కొందరనుకుంటే.

కొందరు పేపర్లో అన్నం తింటున్నాడేమో అనుకున్నారు.కాని దగ్గరికి వెళ్లి చూస్తే కాని తెలియలేదు అది అన్నం కాదు మట్టి అని.దాంతో వెంటనే అతడికి కడుపు నిండా అన్నం పెట్టాలని నిశ్చయించుకుని అదే పని చేశారు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.

ఎందుకు అతనికి ఆ పరిస్థితి వచ్చింది.చివరకు ఏమైంది.

తమిళనాడు రాష్ట్రంలోని థేనికి చెందిన గురుస్వామి వయసు 52 సంవత్సరాలు.దగ్గరి బందువులు పనిఇస్తామని చెప్పడంతో వారితో పాటే శబరిమళకు వెళ్లాడు.తీరా అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు ఇక్కడ ఏ పనికి సరిపోవంటూ చేతిలెత్తేశారు.తీసుకెళ్లిన బంధువులు కనీసం దారిఖర్చులకైనా డబ్బులివ్వకుండా వెళ్లిపొమ్మంటూ పంపేశారు.చేతిలో ఉన్న కొంచెం డబ్బులతో 100 కిలోమీటర్ల దూరంలోని ఎరుమెలికి చేరుకున్నాడు.అక్కడ నుంచి థేనికి వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు.

దీనికితోడు రెండు రోజులు అన్నపానీయాలు లేకుండా కాలం గడిపాడు.ఆకలికి తట్టుకోలేక మండే ఎండలో ఓ ఆయుర్వేద షాప్ దగ్గర కూర్చొని ఓ కాగితంలో ఇసుక పోసుకుని దాన్ని తింటున్నాడు.

చుట్టుపక్కల వారు కొందరు దీన్ని గమనించారు.మండుటెండలో ఆకలికి తట్టుకోలేక అతడు ఇసుక తినడం చూసిన వారికి కడుపు తరుక్కుపోయింది.

దాంతో అతడిని దగ్గర్లోని హోటల్ కి తీసుకెళ్లి భోజనం పెట్టించారు.పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని సొంత ఊరు పంపేందుకు అవసరమైన డబ్బులు స్థానికుల సాయంతో అందించారు.

మనకు రోడ్డు మీద ఎందరో తారసపడుతుంటారు.

పిచ్చోళ్లని మనం చూసీ చూడనట్టుగా వెళ్లిపోతాం.లేదంటే చీదరించుకుంటాం.

కాని ఒక్కొక్కరి వెనుక ఒక వ్యధబరితమైన కథ ఉంటుంది.గురుస్వామి మాదిరిగానే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube