రోజంతా బెడ్ పై గర్భిణిలా ఉండాలనుకున్నాడు.. చివరకు..?!

స్త్రీ జీవితంలో గర్భదారణ అనేది ఒక ముఖ్య ఘట్టం.ప్రతి మహిళ కూడా పిల్లలతో తమ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలని అనుకుంటుంది.

 Man Who Wants To Be Like A Pregnant Woman In A Total Day Fails, Bed, Viral Lates-TeluguStop.com

పిల్లల్ని కనడంతో ఆమెకు రెండో జీవితం ప్రారంభమవుతుంది.పది నెలలు కడుపులో మోసి పేగు తెంచుకుని తన బిడ్డను కంటుంది.

అందుకే అమ్మ తర్వాతే ఎవరైనా అని మన పెద్దలు చెబుతుంటారు.అదే జీవిత సత్యం కూడా.

గర్భంతో ఉన్నప్పుడు ప్రతి మహిళకు కూడా అనేక ఇబ్బందులనేవి తలెత్తుతాయి.మానసికమైన వేదన కలుగుతుంది.

శారీరకంగా అవస్థ పడుతుంది.అంతేకాకుండా విపరీతమైన ఒత్తిడిని మహిళ భరిస్తుంది.

మరి అటువంటి స్త్రీ పడే బాధను ఓ వ్యక్తి పడాలనుకున్నాడు.మహిళలు పడేటటువంటి బాధను, సమస్యలను తెలుసుకోవాలనుకున్నాడు.

అందుకోసం రియాల్టీగా ఓ ప్రయత్నం కూడా చేశాడు.టిక్ టాక్ వీడియోలు చేసుకునే ఆ వ్యక్తి గర్భిణిలా ఉండాలనుకున్నాడు.

కానీ అతడికి ఆ పని సాధ్యం కాలేదు.చివరికి ఓడిపోయాడు.

మెయిట్ లాండ్ హాన్లీ అనే టిక్ టాకర్ వీడియోలు చేసి పాపులర్ అవ్వాలని అనుకున్నాడు.అందులో భాగంగా ఒక రోజంతా గర్భంతో ఉన్నట్లుగా ఉండాలనుకున్నాడు.తన కడుపు మీద పుచ్చకాయను పెట్టుకుని నిండు గర్భిణిలా అయ్యాడు.ఆ తర్వాత బెడ్ మీద పడుకుని కాసేపు సేద తీరాడు.

కొంతసేపు అయిన తర్వాత ఆ వ్యక్తి లేచి నిలబడలేకపోవడమే కాకుండా కదిలేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు.కడుపు మీద శరీరానికి మించి బరువు ఉన్నట్లుగా అనిపించడంతో అతడు లేచి నిలబడలేకపోయాడు.చివరికి గర్భిణిలాగా ఉండాలంటే చాలా కష్టం అనే విషయాన్ని గ్రహించాడు.ప్రస్తుతం అతడు చేసిన ఆ పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోకు లైకుల వర్షం కురిపించారు.

మహిళలా ఉండటం పురుషులకు సాధ్యం కాదని మరికొందరు కామెంట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube