అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి తన కన్న కూతురిని అమ్మకానికి పెట్టాడు.దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని వివరణ అడుగగా అతడు ఇచ్చిన సమాధానం విని జైల్లో పెట్టారు.
స్థానికంగా ఈ ఘటన వైరల్ అయ్యింది.ఇంతకీ అతడు చెప్పిన సమాధానం ఏమిటి.?? తన కూతురుని ఎందుకు అమ్మకానికి పెట్టాడు.??
అనే వివరాలలోకి వెళ్తే పెన్సిల్వేనియాకు చెందిన డెనిజ్ యాక్ వ్యక్తి తన ఇంటి వద్ద కూతురుని విక్రయానికి పెట్టాడు.తన కూతురుని అమ్మేస్తానని 50 డాలర్లు ఇస్తే చాలు నా కూరురిని ఇచ్చేస్తానని బహిరంగ వేలం పెట్టాడు.అటుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులని పిలిచి నా కూతురుని అమ్మేస్తా తీసుకుంటారా అని అడిగాడు.
దాంతో ఓవ్యక్తి మిడిల్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు.
దాంతో డెనిజ్ ఇంటికి వచ్చిన పోలీసులు తన బిడ్డని బిడ్డని ఎందుకు అమ్ముతున్నావు అంటూ డెనిజ్ ని ప్రశ్నించారు.
దాంతో పోలీసులని చూసి కంగారు పడిన అతడు ఏమి చెప్పాలో అర్థం కాకా అలాంటిది ఏమీ లేదు సరదాగా అందరితో జోక్ చేశాను అంతే అంటూ సమాధానం చెప్పడంతో షాక్ అయిన పోలీసులు అతడిని తీసుకెళ్ళి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.అనంతరం అతడు సొంత పూచి కత్తుపై విడుదల అయ్యాడు.