వామ్మో... నాలుగు పెళ్లిళ్లు, ఆరుగురితో సహజీవనం!  

Man Did Four Marriages and Date With Six Members, hyderabed,four marriages,dating with six members ,miyapur,dubai - Telugu Dating With Six, Dubai, Four Marriages, Hyderabed, Miyapur

మన భారతదేశ సంప్రదాయం, చట్ట ప్రకారం ఒక వ్యక్తి కేవలం ఒక సారి మాత్రమే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి.ఒకవేళ వారి మధ్య మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకోవాలనుకుంటే చట్టపరంగా విడాకులు తీసుకొని ఆ వ్యక్తితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా, రెండవ పెళ్ళి చేసుకోవచ్చు.

TeluguStop.com - Man Who Cheated And Married Four Members

కొందరు రెండవ పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య అంగీకారం తెలపడంతో రెండవ పెళ్లి చేసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది.

కానీ ఇలాంటివేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం పెళ్లిళ్లు చేసుకుంటూ పోతున్నారు.

TeluguStop.com - వామ్మో… నాలుగు పెళ్లిళ్లు, ఆరుగురితో సహజీవనం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇలాంటి నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఏకంగా ఒకటికాదు, రెండుకాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకుని మోసం చేస్తున్నాడు.నాలుగు పెళ్లిళ్లు మాత్రమే కాకుండా ఆ వ్యక్తి మరొక ఆరుగురితో సహజీవనం చేస్తున్న ఘటన తాజాగా బయటపడింది.

హైదరాబాద్ మియాపూర్ లో వెంకటబాలకృష్ణ పవన్ కుమార్ అనే వ్యక్తి బాగోతం ఎట్టకేలకు బయటపడింది.అతను 2018లో హిమబిందు అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో పాటు ఆమె దగ్గర కట్నకానుకల కింద 40 లక్షలు తీసుకున్నాడు.పెళ్లయిన తర్వాత ఇద్దరూ కలిసి దుబాయ్ కి వెళ్లారు. దుబాయ్ కి వెళ్లిన ఆ దంపతులు నిత్యం తన భార్యను వేధింపులకు గురి చేసేవాడు.తన భర్తపై అనుమానం రావడంతో హిమబిందు మొత్తం కూపీ లాగింది.దీంతో అతనికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలియడంతో అతనితో గొడవకు దిగింది.

తన నాలుగవ భార్యకు ఎలాగో విషయం తెలిసింది కాబట్టి పవన్ తన మూడో భార్యని తీసుకెళ్లి ఆమెకు పరిచయం చేశాడు.దీంతో తీవ్ర ఆవేదన చెందిన హిమబిందు తన భర్త అయిన పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటి మోసగాడి చేతిలో మరెవరు బలి కాకుండా ఉండడాలని ఆమె పోలీసులను ఫిర్యాదు చేసి పవన్ కి తగిన శిక్ష పడాలని ఆమె కోరారు.

#Hyderabed #Dating With Six #Dubai #Four Marriages #Miyapur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు