అయ్యో.. అతని గుడ్డు పోయిందే!

ఏంటి గుడ్డు పోయిందా? ఇది ఆర్య 2 సినిమా డైలాగ్ ఉన్నట్టుందే అని మీకు అనిపిస్తుంది కదా.కానీ నిజంగానే ఒక వ్యక్తి గుడ్డు పోయింది.

 Man, Vacuum Cleaner, Remove Extra Pepper, Egg, Half Boiled, Man Used Vacuum Clea-TeluguStop.com

ఇంకా ఆ వీడియో చూస్తే ఎవరికైన సరే టక్కున నవ్వేస్తారు.అలా ఉంది ఆ వీడియో.

అసలు ఏమైంది ? ఎందుకు అని అనుకుంటున్నారా?
సాధారణంగా మనం వేసుకున్న ఆమ్లెట్ లో ఉప్పు ఎక్కువైతే ఎం చేస్తాం.ఏది అవకాశం లేకుంటే అలాగే తింటాం.

ఒకవేళ ఉంటే దాన్ని పక్కన పడేసి మరొకటి చేసుకుంటాం.ఇంకా చేసుకొనేకి ఓపిక లేకుంటే అందులోని ఉప్పు, పెప్పర్ తీసేస్తాం.

కానీ ఓ వ్యక్తి ఆఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకున్నాడు.ఇంకా దానిపై పెప్పర్‌ను చల్లాడు.

అయితే ఆ పెప్పర్ ను చేతికి అంటకుండా తియ్యాలనుకున్నాడు.దీంతో అతని అతి తెలివిని ఉపయోగించాడు.దానికి అతను ఏం చేశాడో తెలుసా? ఇంట్లో దుమ్మూ, దూళిని శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్‌తో ప్లేటులో ఉన్న ఆమ్లెట్ మీద పెప్పర్‌ను తీయడానికి ప్రయత్నించాడు.ఇంతవరకు బాగానే ఉంది.

కానీ ఆ వాక్యూమ్ పెప్పర్‌ను మాత్రమే తియ్యలేదు పాపం.అతని గుడ్డును కూడా ఆ వాక్యూమ్ క్లీనర్ మింగేసింది.అయితే ఇలా చేసే సమయంలో అతను దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో అది ఒక్కసారిగా వైరల్‌గా మారింది.”అయ్యో.అతని గుడ్డుపోయిందే” అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ వీడియోని చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube