మామూలుగా ద్విచక్ర వాహనాన్ని ఎవరైనా సరే ఒక చోట నుండి మరో చోటికి ప్రయాణించడానికి వాడుతుంటారు.అయితే తాజాగా ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి కలుపు తీసే యంత్రాన్ని అనుసంధానం చేసి కలుపు తీస్తున్నటువంటి ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో హల చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే ప్రస్తుత కాలంలో వ్యవసాయ పనులకు బాగా గిరాకీ పెరగడంతో అప్పుడప్పుడు కూలీల కొరత ఏర్పడుతోంది.దీంతో ఓ వ్యక్తి తన హీరో హోండా ప్యాషన్ ప్లస్ ద్విచక్ర వాహనానికి పంటలో కలుపు తీసే పరికరాన్ని అమర్చాడు.
అలాగే ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించి కలుపు తీసే ప్రక్రియలో విజయవంతం అయ్యాడు.ఇదంతా గమనిస్తున్నటువంటి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి యువకులు ద్విచక్ర వాహనంతో కలుపు తీసే సమయంలో వీడియోని తీసి సోషల్ మీడియా మాధ్యమాలు షేర్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతుంది.దాంతో కొంత మంది నెటిజన్లు మోటార్ సైకిల్ ని ఇలా కూడా ఉపయోగిస్తారా….? అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.మరికొంతమంది మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ విజయవంతమైతే వ్యవసాయంలో మంచి వృద్ధి సాధించవచ్చని అంటున్నారు.
అయితే ద్విచక్ర వాహనానికి కలుపు తీసే పరికరాన్ని అమర్చి విజయవంతం అయినటువంటి ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.