సిగ్గొదిలేసిన ప్రబుద్ధుడు.. ఎయిర్‌పోర్టులో అందరిముందే కానిచ్చాడు!

ఎవరికైనా అర్జెంటుగా మూత్రం వస్తే వెంటనే బాత్రూంకు పరిగెడుతారు.ఎంత అర్జెంటుగా వచ్చినా సరైన ప్రదేశం దొరికే వరకు వేచిచూస్తారు.

 Man Urinates In Airport In Front Of Passengers-TeluguStop.com

కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం సిగ్గొదిలేసి కూర్చున్నచోటే కానిచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఓ వ్యక్తి టెర్మినల్‌లో కూర్చుకున్నాడు.అతడు బిత్తరచూపులు చూస్తూ మెల్లిగా ఏవో కదలికలు చేస్తున్నాడు.

దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాకు పనిచెప్పాడు.కాగా ఆ కూర్చున్న వ్యక్తి అందరు చూస్తున్నారన్న కనీస ఇంకిజ్ఞానం కూడా లేకుండా బహిరంగంగా మూత్రవిసర్జన చేశాడు.

ఇది చూసి అక్కడున్న ప్రయాణికులంతా ఒక్కాసారిగా అవాక్కయ్యారు.ఈ వీడియోను తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేయడంతో ఈ వీడియోను 2 లక్షల మంది వీక్షించారు.

అతడు సిగ్గొదిలేసినట్లు ఉన్నాడు, అందుకే అలా చేశాడని కొందరు, అతడు చేసిన పనికి ఎయిర్ పోర్టు అధికారులు అతడికి తగిన బుద్ధి చెప్పాలని నెటిజన్లు కామెంట్ చేశారు.కాగా అతడు ఎందుకు అలా చేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube