అవమానించారని ఏకంగా 9 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న యువకుడు... చివరికి

ఒక మనిషికి జరిగిన అవమానం అతన్ని ఎంత వరకైనా తెగించేలా చేస్తుంది.జీవితంలో ఎదురయ్యే అవమానాలు కొంత మందిని దుర్మార్ఖుడుగా మార్చేస్తే కొంతమందిని సమాజానికి ఆదర్శంగా నిలబడేలా చేస్తాయి.

 Man Undergoes Plastic Surgery After Failing To Get Job, Vietnamese, Social Medi-TeluguStop.com

అలాంటి స్ఫూర్తిని నింపే కథలు మన చుట్టూనే జరుగుతూ ఉంటాయి.అవమానాలకి క్రుంగిపోకుండా ఆదర్శవంతంగా మారడం అనేది అందరికి సాధ్యమయ్యే పని కాదు.

ఇప్పుడు అలాంటి అవమానమే ఓ యువకుడుని అందగాడుగా మారించింది.అతని రూపాన్ని చూసి ఎగతాళి చేశారని ప్లాస్టిక్ సర్జరీతో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా తనని తాను మార్చేసుకొని అందమైన యువకుడుగా మారిపోయాడు.

ఇప్పుడు ఆ యువకుడికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వియ‌త్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్‌ ఏ ఇంట‌ర్వ్యూకి వెళ్లినా అక్క‌డ అవ‌మానాలు ఎదుర‌య్యేవి.

ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తులు అత‌ని మొహాన్ని చూసి హేళన చేసేవారు.దీంతో మ‌న‌స్తాపానికిగా గురైన ఆ యువ‌కుడికి త‌న మొహంపై అస‌హ్యం వేసింది.ఎలాగైనా త‌న ముఖాన్ని అందంగా మార్చుకోవాల‌ని అనుకున్నాడు.ఇందుకోసం కొద్దిరోజులు మేక‌ప్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేసి 12 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదించాడు.

వాటితో 9 స‌ర్జ‌రీలు చేయించుకున్నాడు.హాలీవుడ్ హీరోలా త‌యార‌య్యాడు.

స‌ర్జ‌రీకి ముందు ఫొటోను, ఇప్ప‌టి ఫొటోను తాజాగా డూ కూయెన్ టిక్‌టాక్‌లో షేర్ చేశాడు.అందులో తాను ఎదుర్కొన్న అవ‌మానాలు, ఛీత్కారాల‌ను వివ‌రించాడు.

ఆ రెండు ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ముఖం మారిన తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు కూడా తనని గుర్తుపట్టలేకపోయారని ఆ యువకుడు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు అతని ఫోటోలు వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube