ఈఎమ్ఐ కట్టమంటూ ఫోన్ చేసిన ఫైనాన్స్ ఉద్యోగిని ఏం చేసాడో తెలుసా ?

కరోనా కారణంగా దేశం మొత్తం రెండుమూడు నెలలు పాటు లాక్ డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీని వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాం.

 Man Unable To Repay The Loan Leads To Murder In Pune, Crime News, Pune, Covid-19-TeluguStop.com

ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.ఆ పరిస్థితుల నుండి చాలామంది ఇప్పటికి కోలుకోలేకపోతున్నారు.

అసలే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే దీనికితోడు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు కూడా కట్టలేని పరిస్థితి.

కానీ బ్యాంకుల వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే ఊరుకోరు కదా.ఫోన్లు చేస్తూనే ఉంటారు.కరోనా సమయంలో కొన్ని నెలలు ప్రభుత్వం ఉరటనిచ్చినా మల్లి ఇప్పుడు అదే గోల మొదలయ్యింది.

ఒక వ్యక్తి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు.కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు.

మళ్ళీ ఈఎంఐ కట్టలేదని బ్యాంకు వాళ్ళు ఫోన్ చూస్తూ ఉన్నారు.

లోన్ ఇచ్చినవారి నుండి రోజు ఫోన్ వస్తుండడంతో అతడికి విసుగు వేసింది.

ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

మహారాష్ట్ర పుణెకు సమీప గ్రామంలో లక్ష్మణ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.అక్కడే ఉన్న ఫైనాన్స్ కంపెనీలో లక్ష్మణ్ 98 వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు.

అయితే కరోనా ముందు ఈఎంఐ బాగానే చెల్లించినా కరోనా తర్వాత ఉద్యోగం లేకపోవడంతో ఈఎంఐ చెల్లించలేక పోయాడు.

Telugu Banks, Corona, Covid, Jobless, Lakshman, Loan, Maharastra, Murdered, Pune

లక్ష్మణ్ లోన్ చెల్లించలేదని ఫైనాన్స్ వారు పదే పదే ఫోన్ చేస్తున్నారు.అటు ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న లక్ష్మణ్ ఫైనాన్స్ వారు కూడా ఈఎంఐ కట్టమని ఫోన్ చేస్తుండడంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు.ఈ క్రమంలోనే మంగళవారం రోజు కూడా ఫైనాన్స్ చెల్లించమంటూ కాల్ వచ్చింది.

లక్ష్మణ్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు.ఉన్నప్పుడు కడతా.

అని చెప్పడంతో వారిద్దరి మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది.

దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన లక్ష్మణ్ ఆ రోజు సాయంత్రం ఫైనాన్స్ ఉద్యోగి బయటకు రావడంతో లక్ష్మణ్ ఒక్కసారిగా అతనిపై కత్తితో దాడి చేసాడు.

తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.ఈ ఘటనపై అతని సహఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube