ప్రేమించిన ప్రేయసి ని పెళ్లి చేసుకోవడం కోసం పోలీస్ గా మారిన ప్రియుడు..చివరికి ఏమైందంటే...  

Man Turns Fake Dsp To Get Married With Her Girlfriend-hyderabad,man Posing As Dsp,ravi Chandra,పోలీస్ గా మారిన ప్రియుడు

ఈ మధ్య అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయిల కోసం ఎలాంటి అడ్డదారులైన తొక్కుతున్నారు. ఇటీవల కాలం లో తన ప్రేయసి పుట్టిన రోజున బహుబతి ఇవ్వడం కోసం ఏకంగా గన్ తో బెదిరిస్తూ దొంగతనాల గురించి వినే ఉన్నాం. అయితే ఇలాంటి ఒక సంఘటన ఒకటి ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది..

ప్రేమించిన ప్రేయసి ని పెళ్లి చేసుకోవడం కోసం పోలీస్ గా మారిన ప్రియుడు..చివరికి ఏమైందంటే...-Man Turns Fake Dsp To Get Married With Her Girlfriend

ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆమె కోసం ఫేక్ పోలీస్ గా అవతారం ఎత్తాడు. చివరికి జైలు గోడలు మధ్య ఉసలు లెక్కిస్తున్నాడు. అసలు విషయానికి వస్తే.

వెస్ట్‌ మారేడుపల్లిలోని సామ్రాట్‌కాలనీ రేఖా రెసిడెన్సీలో నివసిస్తున్న రవిచంద్ర కొంత కాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెని పెళ్లి చేసుకుంటానని వారి పెద్దలకు కూడా చెప్పాడు.

అయితే బి. టెక్ పూర్తి చేసుకున్న రవిచంద్ర ఖాళీగా ఉండడం తో అమ్మాయి వల్ల పెద్దలు వారి పెళ్లికి అసలు ఒప్పుకోలేదు.వాళ్ళు పెళ్లికి నిరాకరించడం తో ఏం చేయాలో తెలియక తనకు డీఎస్పీగా ఉద్యోగం వచ్చిందని ప్రియురాలికి చెప్పాడు.

యూనిఫాం వేసుకొని ఫొటోలు తీసి పంపాడు.అంతే కాకుండా రవించంద్ర తన కుటుంబ సభ్యులను , స్నేహితులను కూడా నమ్మించాడు.

వెస్ట్ మారేడ్ పల్లి లో నివాసం ఉంటున్న రవిచంద్ర తన చుట్టుపక్కల ఉంటున్న వారికి ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నానని తెలిపాడు.2012లో రిక్రూట్‌మెంట్‌ బ్యాచ్‌కు చెందిన పోలీస్ గా పలువురికి చెప్పుకున్నాడు. పోలీసు యూనిఫాంతో పాటు ఐడీ కార్డు, నేమ్‌ ప్లేటులతో ఏసీపీగా చలామణి అవుతున్నాడు. తరచుగా యూనిఫాంలో తిరుగుతూ స్థానికులను నమ్మించాడు. అయితే స్థానికులకు కొద్దీ రోజులుగా అతని పైన అనుమానాలు రావడం తో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందించారు.

రవిచంద్ర పోలీస్ యూనిఫామ్ లో తిరుగుతున్నపుడు అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు , అతని వద్ద నుండి ఐడి కార్డు, పోలీస్‌ యూనిఫాం, నేమ్‌ ప్లేట్, మెడికల్‌ సర్టిఫికెట్, గ్రీన్‌ ఇంక్‌ పెన్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీన పర్చుకున్నారు. రవిచంద్ర తన స్నేహితులనే ఉన్నతాధికారులుగా పలువురికి పరిచయం చేశాడు. కొన్నాళ్ల నుండి పోలీసు గా చలామణి అవుతున్న రవిచంద్ర చివరికి జైలు గోడలు మధ్య ఉసలు లెక్కబెడుతున్నారు…