దారుణం: తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని కరోనా మందని చెప్పి…  

Man Try To Murder Home Guard Family In New Delhi - Telugu Crime News, Home Guard, Illegal Airfare, Man Try To Murder, New Delhi

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు మరియు చేసేటువంటి పనుల కారణంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తాను నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో హోమ్ గార్డుగా పని చేస్తున్నటువంటి వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఏకంగా కరోనా మందు అని చెప్పి  ఏకంగా విషం ఇచ్చి హత్యాయత్నం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Man Try To Murder Home Guard Family In New Delhi

వివరాల్లోకి వెళితే స్థానిక  ఢిల్లీలోని అలిపూర్ ప్రాంతంలో ప్రదీప్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడు గత కొద్దికాలంగా తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో తన భార్య సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తి గురించి ఆరా తీశాడు.అయితే ఆ వ్యక్తి స్థానిక ప్రాంతంలో హోంగార్డుగా పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.ఈ క్రమంలో ఎలాగైనా అతడిని హత్య చేయాలని పథకం పన్నాడు.ఈ పథకంలో భాగంగా ఇద్దరు మహిళల సహాయంతో హోంగార్డు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ ను నివారించే మందు అని చెప్పి విషాన్ని అందించారు.

దారుణం: తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని కరోనా మందని చెప్పి…-Latest News-Telugu Tollywood Photo Image

విషయం తెలియని కుటుంబ సభ్యులు ఆ మందుని తీసుకోవడంతో అస్వస్థతకు గురైన ఆసుపత్రి పాలయ్యారు.

దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే బాధితులను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

దీంతో వెంటనే నిందితుడిని మరియు నిందితుడికి సహాయపడినటువంటి మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు