విడ్డూరం : గిన్నీస్‌ రికార్డ్‌ కోసం టాయిలెట్‌లో ఎన్ని రోజులున్నాడో తెలుసా?

ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు పలువురు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కొందరు గిన్నీస్‌ రికార్డు కోసం ప్రాణాలు పోగొట్టుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి.

ఇక కొందరు చేసే పనులు మరీ చిల్లరగా కూడా అనిపిస్తూ ఉంటాయి.ఎంతో మంది గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ల్లో ఎక్కారు.

వారిలో గొప్ప పనులు చేసిన వారు ఉంటే మరి కొందరు చిల్లర పనులు అసహ్యంగా ఉండే పనులు చేసే వారు ఉన్నారు.ఎలాంటి పని చేసినా కూడా గినీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో ఎక్కితే చాలు అనుకునే వారు చాలా మంది ఉన్నారు.

విడ్డూరం : గిన్నీస్‌ రికార్డ్�

అలాంటి వ్యక్తి జిమ్మి డీ ఫ్రెన్నె.ఇతడు ఒక బస్సు డ్రైవర్‌.రోజులో ఎక్కువ సమయం ఇతడు కూర్చుని ఉంటాడు.అలాంటి ఇతడికి ఒక వింతైన ఆలోచన వచ్చింది.నేను ఎక్కువ సేపు కూర్చుని రికార్డు సృష్టిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు.అప్పుడు అతడు మరింత విడ్డూరంగా ఉండాలంటే ఒక టాయిలెట్‌లో కూర్చుంటే మరింత బాగుంటుందని భావించాడు.

అనుకున్నదే అతడువుగా ఒక బార్‌లో టాయిలెట్‌ సెటప్‌ తనకోసం చేయించుకుని తన ప్రయోగం మొదలు పెట్టాడు.

విడ్డూరం : గిన్నీస్‌ రికార్డ్�

165 గంటల పాటు టాయిలెట్‌ బేషిన్‌పై కూర్చుని అలాగే ఉండాలనుకున్నాడు.గతంలో 100 గంటలు కూర్చున్న రికార్డు ఉంది.ఇప్పుడు దాన్ని 165 గంటలతో బ్రేక్‌ చేయాలని బిమ్మి అనుకున్నాడు.

ఆన్‌ లైన్‌ ద్వారా గిన్నీస్‌ బుక్‌ వారిని సంప్రదించాడు.వారి అధికారులు రావడంతో రికార్డు కార్యక్రమం మొదలు పెట్టాడు.

ముందుగా అనుకున్న ప్రకారం 165 గంటలు అతడి వల్ల కాలేదు.కాని రికార్డు మాత్రం బ్రేక్‌ అయ్యింది.116 గంటల పాటు కూర్చున్నాడు.ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల అతడి కాళ్లు చాలా వాచిపోయాయి.

అనుకుంటాం కాని అన్ని గంటలు కూర్చోవడం సాధ్యం కాదని జిమ్మి రికార్డు నమోదు అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube