మగధీర ఫీట్ చేయాలని నడ్డి విరగ్గొట్టుకున్నాడు  

Man Tries To Jump Onto Horse Carriage Falls Down-horse Carriage,magadheera,man,viral Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో ఓ సీన్‌లో హీరో గుర్రంపైకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కుతాడు.ఈ సీన్ చూసిన మెగా ఫ్యాన్స్ థియేటర్లలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Man Tries To Jump Onto Horse Carriage Falls Down-horse Carriage,magadheera,man,viral Video Telugu Viral News Man Tries To Jump Onto Horse Carriage Falls Down-horse Magadheera Man Viral Video-Man Tries To Jump Onto Horse Carriage Falls Down-Horse Magadheera Man Viral Video

మెగాస్టార్ గుర్రంపైకి ఎక్కి చేసే ఫీట్స్ చూసి ప్రేక్షకులు వావ్ అంటూ నోరెళ్లబెట్టారు.అయితే ఇదంతా సినిమా అనే విషయం మరిచిన ఓ వ్యక్తి అదే ఫీట్‌ను రియల్ లైఫ్‌లో చేయాలని ప్రయత్నించి ఎముకలు విరగ్గొట్టుకున్నాడు.

మహారాష్ట్రలోని పుణేలో ఓ వ్యక్తి గుర్రపు స్వారీకి లైట్లతో అలంకరణ చేసి రన్నింగ్‌లో దానిపై ఎక్కాలని అనుకున్నాడు.దీంతో గుర్రపు స్వారీని వేగంగా పరిగిత్తిస్తూ దాని వెనక బైకుపై వెళ్లాడు.

వేగంగా పరిగెడుతున్న గుర్రపు స్వారీ బండిని రన్నింగ్‌లో ఎక్కాలని ప్రయత్నించిన అతడు అదే బండికింద పడిపోయాడు.దీంతో ఆ బండి అతడి మీద నుండి వెళ్లింది.

ఈ ఘటనలో మనోడికి పెద్దగా గాయాలు కాకపోయినా ఎముకలు విరిగినంత పని జరిగింది.ఇదంతా బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి మగధీర ఫీట్ చేయబోయిన వ్యక్తిని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆడుకుంటున్నారు.కొందరు అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు దూల తీరింది అంటూ సెటైర్లు వేస్తున్నారు.

తాజా వార్తలు