పోలీసులు ఫైన్ వేస్తే ఇలా చేయాలా ? ఓరి నీ యాసాలో  

man throws bike after being fines for not wearing helmet - Telugu Helmet Transport Department Bike Uttarapradesh Meerat Licence Penalty States

ఒక్కోసారి ఒక్కొక్కరు ఊహించని విధంగా ప్రవర్తిస్తూ నలుగురిలో నవ్వులపాలవుతూ ఉంటారు.తమలోని కోపాన్ని అణుచుకునేందుకు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ చుట్టుపక్కల వారికి వినోదం పంచుతూ వార్తల్లో వ్యక్తులుగా మారిపోతుంటారు.

Man Throws Bike After Being Fines For Not Wearing Helmet

ఈ విధంగానే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పోలీస్ లు ఫైన్ వేశారన్న కోపం తో చిత్ర విచిత్రంగా ప్రవర్తించి నవ్వులపాలయ్యాడు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రవాణా చట్టాన్ని కొన్ని కొన్ని రాష్ట్రాలు చూసి చూడనట్టుగా వదిలేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం కఠినంగా అమలు చేస్తున్నాయి.

దీని ప్రకారం కొన్నివిషయాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే వెయ్యి, లైసెన్స్ లేకపోతే 5వేలు ఇలా అపరాధ రుసుము విధిస్తున్నారు.

ఇంత భారీ జరిమానాలు విధిస్తే కానీ వాహనచోదకులు నిబంధనలు పాటించారనేది అధికారుల అభిప్రాయం.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్న ఓ యువకుడికి పోలీసులు వెయ్యి రూపాయల ఫైన్ వేశారు.

ఫైన్ వేసి కట్టమని చెప్పగా ఆ యువకుడు బైక్ ను కిందపడేసి తొక్కేశాడు.తనకు ఈ బైక్ వద్దని చెబుతూ బైక్ ను కిందా మీద పడేసి వింతగా ప్రవర్తించాడు.

అనంతరం ఆ యువకుడు చిన్నపిల్లవాడిలా ఎక్కి ఎక్కి ఏడవడంతో పోలీసులు అతగాడిని ఓదార్చాల్సి వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Throws Bike After Being Fines For Not Wearing Helmet Related Telugu News,Photos/Pics,Images..