చేతబడి చేశాడన్న అనుమానం తో యువకుడి సజీవదహనం  

Man Suspected To Have Been Burnt A On Funeral Pyre-anjaneyulu,hyderabad Sameerpet Police Station,man Suspected

టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయిన ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక చోట ఈ మూఢ నమ్మకాల గోల మాత్రం వినపడుతూనే ఉంది.ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

Man Suspected To Have Been Burnt Alive On Funeral Pyre-Anjaneyulu Hyderabad Sameerpet Police Station

అయితే ఈ మూఢ నమ్మకాల కారణంగా మరో యువకుడు బలైన ఘటన సంచలనంగా మారింది.అయితే ఈ తాజా ఘటన ఎక్కడో మారు మూల గ్రామంలో నే లేదంటే మరేదైనా మారు మూల ప్రాంతంలో జరిగింది అనుకుంటే పొరపాటే.

ఈ తాజా ఘటన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.హైదరాబాద్‌ శామీర్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అద్రాస్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

Man Suspected To Have Been Burnt Alive On Funeral Pyre-Anjaneyulu Hyderabad Sameerpet Police Station

గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళకు చేతబడి చేశాడన్ననెపంతో 24 సంవత్సరాల ఆంజనేయులు అనే యువకుడిని సజీవ దహనం చేయడం తీవ్ర సంచలనంగా మారింది.ఆ మహిళ తరపు బంధువులు సదరు మహిళ కు ఆంజనేయులు చేతబడి చేసాడు అంటూ నెపం మోపి ఈ క్రమంలో అతడిని కాల్చి సజీవ దహనం చేయడం అక్కడి పరిసర గ్రామాల్లో కలకాలంగా మారింది.


లక్ష్మీ చితిపైనే యువకుడ్ని కూడా పడేసి సజీవదహనం చేయడం కలకలం సృష్టిస్తోంది.అయితే ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Man Suspected To Have Been Burnt A On Funeral Pyre-anjaneyulu,hyderabad Sameerpet Police Station,man Suspected Related....