మహిళా శవంతో మూడు రోజులు.. వీడి భయం తగిలెయ్యా.. !  

man stays, woman dead body, three days, nagarkurnool - Telugu Man Stays, Nagarkurnool, Three Days, Woman Dead Body

మనిషిలో ఉన్న కౄరత్వం ఎంతకైన తెగిస్తే, అదే మనిషిలో ఉన్న భయం కూడా వికౄతంగా ప్రవర్తిస్తుంది.తన ప్రవర్తన వల్ల తనకు తెలియకుండానే ఎన్నో చిక్కుల్లో పడే అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

TeluguStop.com - Man Stays With Woman Dead Body For Three Days

అందుకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిర్బయంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలంటారు పెద్దలు.

ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.

ఒక వ్యక్తి తనకున్న భయం వల్ల ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాడు.ఆ విషయం ఏంటో తెలుసుకుంటే.

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి తన కూతురు కళమ్మకు ఇరవై ఏళ్ల క్రితం శేఖర్‌ అనే అతనితో పెళ్లి చేయగా ఏడాది కూడా గడవక ముందే అతను మరణించాడట.శేఖర్ మరణించాడు.

దీంతో ఆ యువతిని బాలపీరు అనే అతనికి ఇచ్చి రెండో వివాహం జరిపించారు.కొన్నేళ్ల కిందట బాలపీరు కూడా మృతిచెందడంతో ఆ యువతి తల్లిదండ్రుల వద్దే ఉంటుందట.

ఈ క్రమంలో తండ్రి కూతురికి ఒక విషయంలో గొడవ జరగగా ఆ యువతి తన మొదటి భర్త తమ్ముడి ఇంటికి వెళ్లి అక్కడ అనుమాద స్పదంగా మృతిచెందింది.

ఈ విషయం బయటకు తెలిస్తే తనను నేరస్దుడిగా చూస్తారని భావించిన ఆమె మరిది మూడు రోజుల పాటు ఇంట్లోనే కళమ్మ మృతదేహంతో సహవాసం చేశాడు.

రోజురోజుకు ఆశవం దుర్వాసన ఎక్కువవుతుండటంతో ఎవరికి తెలియకుండా పాతి పెట్టాలని భావించాడు గానీ తనవల్ల కాకపోయే సరికి గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరాడు.దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పీలూసుల వరకు వెళ్లగా వారు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#Woman Dead Body #Nagarkurnool #Man Stays #Three Days

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు