రెండు అంగుళాల ఎత్తు కోసం ఆ యువకుడు పెట్టిన ఖర్చెంతో తెలిస్తే?

అందరికీ ఒక్కొక్క లోపం ఉంటుంది.కాని దానిని పెద్దదిగా చూస్తే మనం సంతోషంగా ఉండలేము.

 Us Man Spent 55lakhs To Increase 2inch Height, Us Man,height Increase Surgery, S-TeluguStop.com

మనం దానిని పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యాన్ని పట్టించుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం.కాని ఇక దాని గురించి మనం దానిని సవరించుకునే ప్రయత్నం చేస్తే అది వికటించి మన ప్రాణాలే పోవచ్చు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే కొందరికి వారిలో వారికి ఎదో ఒకటి నచ్చదు.ముఖ్యంగా ఎత్తు విషయంలో చాలా మంది వారి ఎత్తు పెంచుకోవడానికి సర్జరీ చేయించుకునే ప్రయత్నం చేస్తారు.

అలా సర్జరీ వికటించి ప్రాణాల మీదికి తెచ్చుకొని పూర్తిగా నడవలేని స్థితిలోకి చేరిన ఘటన మన హైదరాబాదులో నిఖిల్ రెడ్డి అనే యువకుడికి జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఇలా అమెరికాకు చెందిన ఆల్ఫోన్నో ఫ్లోర్స్ అనే యువకుడు బాస్కెట్ బాల్ క్రీడాకారుల లాగా ఎత్తుగా ఉండాలని అనుకుకొని సర్జరీ చేసుకోవడంతో అతని ఎత్తు 6.1 అడుగులకు చేరింది.ఈ సర్జరీలో అతడి ఎముక పొడవు పెంచడం వలన 5.9 (1/2) ఉన్న అతని ఎత్తు 6.1 అడుగులకు చేరింది.కాని సర్జరీ నిర్ణయాన్ని అతని స్నేహితులు వారించినా సర్జరీ చేయించుకోవడానికి నిర్ణయించుకొన్నాడు.అయితే ఈ రెండు అంగుళాలు పెరగడానికి అతను సర్జరీకి అక్షరాల రూ.55 లక్షలు ఖర్చు చేసాడు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవడంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube