ఫోన్ లో గేమ్ కోసం ఏకంగా రూ. 5.6 లక్షలు మాయం చేసిన ఘనుడు …!  

Man Spent 5.6 Lakhs for Games, Games, Police Complaint,Video game - Telugu Games, Man Spent 5.6 Lakhs For Games, Police Complaint, Video Game

ఆన్ లైన్ లో డబ్బు కోసం బంధించిన వ్యాపార వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయో మరోసారి రుజువైంది.కరోనా వైరస్ పుణ్యమా అని విద్యార్థులు అందరూ ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ క్లాసులు ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు.

 Man Spent 5 6lakhs For Video Game

ఇందుకోసం ఓ తల్లిదండ్రులు తన కుమారుడి కోసం ఫోన్ ఇచ్చారు.అయితే ఏదో పని మీద ఆ తల్లి ఊరికి వెళ్లడంతో ఏకంగా ఐదున్నర లక్షల రూపాయల నష్టపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇకపోతే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం లో జరిగింది.

ఫోన్ లో గేమ్ కోసం ఏకంగా రూ. 5.6 లక్షలు మాయం చేసిన ఘనుడు …-General-Telugu-Telugu Tollywood Photo Image

చదువు కోసమని తన కుమారుడికి ఓ తల్లి తన ఫోన్ ఇచ్చి ఊరికి వెళ్ళింది.

ఇకపోతే ఆన్లైన్ క్లాస్ ముగిసిన తర్వాత ఆ అబ్బాయి ఫోన్ ద్వారా ఓ వీడియో గేమ్ ని డౌన్ లోడ్ చేసుకొని జూన్ 20వ తారీకు నుండి గేమ్ ఆడుతూ వచ్చాడు.ఓ కార్ గేమ్ కు సంబంధించి గేమ్ లో చూపించిన విధంగా డబ్బు పెట్టి అందులోని కొత్త వాటికోసం కొనడం మొదలుపెట్టాడు.

ఈ విషయం అంతా తనకే అర్థం అవుతుందో లేదో తెలియకుండానే మొత్తం జరిగిపోయింది.ఇందుకోసం ఏకంగా 30 వేల రూపాయలను రోజుకు ఖర్చు చేశాడు.మోతంగా 5 లక్షలకు పైగా కోల్పోయారు.

ఈ విషయం గమనించని ఆ తల్లి తన అకౌంట్లో నుండి డబ్బులు డ్రా చేద్దాం అని ప్రయత్నించగా, అందులో డబ్బులు లేవని చూపించడంతో షాక్ కు గురైంది.

వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి అసలు ఆ డబ్బులు ఎలా మిస్ అయ్యాయని విచారణ చేపట్టగా అసలు విషయం బయటికి వచ్చింది.దీంతో ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతుంది.

కాబట్టి మీ పిల్లలు ఇలాంటి పొరపాటు చేయకుండా తగు జాగ్రత్తలు పాటించండి.

#Games #Video Game

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Spent 5 6lakhs For Video Game Related Telugu News,Photos/Pics,Images..