బెంజ్ కారు లో కూర్చొని తనని తాను కాల్చుకున్నాడు

హైదరాబాద్ లో ఒక వ్యక్తి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు.హైదరాబాద్ లోని నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుకు రెడ్ కలర్ బెంజ్ కారులో ఫైజల్ అనే వ్యక్తి వచ్చి అనంతరం తన వద్ద ఉన్న తుపాకీ తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 Man Shoots Him Self-TeluguStop.com

అయితే ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడడం తో హుటాహుటిన గచ్చి బౌలి లోని కేర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.గురువారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయితే అతడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు తెలుస్తుంది.టీఎస్09యుబి6040 అనే బెంజ్ కారులో గురువారం మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డుపైకి వచ్చిన ఫైజల్ కారును ఆపేసి తనకు తానుగా కాల్చుకున్నాడు.అయితే ఫైజల్ ఆ బెంజ్ కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

అంతేకాకుండా అతడు ఖైరతాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో వీసా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడని, అతడికి ఆర్ధిక పరమైన సమస్యలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఆర్ధిక సమస్యలే అతడి ఆత్మహత్యకు కారణంగా లేదంటే మీరేదైనా కారణం ఉందా అన్న కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన సమయంలో కారులో ఫైజల్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అతడి సెల్ ఫోన్ నుంచి పోలీసులు కొంత సమాచారం సేకరించినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube