మనిషి ఆకారంలో ఉన్న ఊరు.. గ్రహాంతరవాసులే దీన్ని నిర్మించారా.. నిజాలు తెలిస్తే షాకే!

ఈ ప్రపంచంలోని కొన్ని గ్రామాలకు చాలా వింతలు, విశేషాలు ఉంటాయి.ఇలాంటి గ్రామాల గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోక తప్పదు.

 Man-shaped Town Was It Built By Aliens  Shock If You Know The Facts , Men Shape,-TeluguStop.com

తాజాగా అలాంటి ఒక గ్రామం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ గ్రామం మనిషి ఆకారంలో ఉండటమే ఇందుకు కారణం.

సాధారణంగా గ్రామాలు గుండ్రంగా లేదా పొడవుగా లేదా అడ్డంగా విస్తరించి ఉంటాయి.కానీ మనం చెప్పుకో పోయే గ్రామం మాత్రం మనిషి ఆకారంలో విస్తరించుకుంటూ పోయింది.

దీంతో ఆకాశం పైనుంచి చూస్తుంటే ఒక మనిషిలాగా ఈ గ్రామం కనిపిస్తుంది.దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళితే. ఇటలీలోని ఎన్నా ప్రావిన్సులో సెంటూరిపే అనే 5,000 జనాభా గల ఒక విలేజ్ ఉంది.ఈ గ్రామానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.అయితే ఈ గ్రామం ఒక మనిషి ఆకారంలో ఏర్పడిందనే విషయం ఆ గ్రామ ప్రజలకు కూడా మొన్నటి వరకు తెలియదు.

ఈ విషయాన్ని ఇటీవలే ఆ ఊరిలోనే నివసించే ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా గూగుల్ ఎర్త్ సహాయంతో కనుగొన్నారు.మొదటగా విలేజ్ మ్యాప్ చూసి అబ్బుర పడ్డారు.

స్టార్ ఫిష్ ఆకారంలో భలే అందంగా ఉందని అనుకున్నారు.ఈ ఊరి అందాలను కెమెరాల్లో బంధించేందుకు డ్రోన్ సాయంతో పలు ఫొటోలు, వీడియోలు తీశారు.

ఈ ఫొటోలు నిశితంగా పరిశీలిస్తే అది స్టార్ షిఫ్ లా లేదని మనిషి ఆకారంలో ఉందని తెలిసింది.

దీంతో ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా మరింత ఆశ్చర్యపోయారు.

ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.ఈ గ్రామాన్ని గ్రహాంతర వాసే డిజైన్ చేసి ఉంటారా, భూమిపై ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు దాగున్నాయని తెలుసుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube