కొత్త ట్రాఫిక్ రూల్స్ తో బెంబేలెత్తుతున్న జనాలు,పోలీసులకే ఝలక్ ఇచ్చిన వ్యక్తి

ఈనెల 1 వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ కొత్త రూల్స్ తో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 Man Setsmotorcycle Onfireafter He Wasissuedchallan Sarayi-TeluguStop.com

వాహనాలు తీసుకొని ఎలా బడితే అలా బయటకు వెళ్లారో ఎలాంటి కేసులో బుక్ అవుతామో అన్న భయం కూడా వారిలో ఏర్పడిపోయింది.అయితే గురువారం ఒక వ్యక్తి ఇలా ట్రాఫిక్ నిబంధలను తప్పించి పోలీసులకు దొరికిపోయాడు.

అయితే ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులకే ఆ వ్యక్తి మంచి ఝలక్ ఇచ్చాడు.ట్రాఫిక్ చలానా చెల్లించామని కోరడం తో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన బైకునే తగులబెట్టుసుకోవడం గమనార్హం.

ఢిల్లీలోని షేక్ సరాయి ఫేస్‌-1లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గురువారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు రాకేష్ అనే బైకర్‌ను అడ్డుకున్నారు.

మద్యం మత్తులో ఉన్న అతడిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం ప్రభావం 200 దాటినట్లు గుర్తించారు.దీంతో పోలీసులు అతడిని బైకు పత్రాలను, లైసెన్స్ అడిగారు.అతని వద్ద అవేమీ లేకపోవడంతో రకరకాల పెనాల్టీలతో ఆ బైక్‌పై రూ.3,900 జరిమానా విధించారు.అయితే డబ్బులు చెల్లించలేనని చెప్పడంతో పోలీసులు అతడి బైకును స్వాధీనం చేసుకుని పక్కన పెట్టారు.

Telugu Sets Motorcycle, Setsmotorcycle, Trafic Challan, Trafic-

అయితే ఆ సమయంలో రాకేష్ బైకులో ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి అని వాటిని తీసుకుంటానని చెప్పి బైకు వద్దకు వెళ్ళాడు.అయితే ఆ సమయంలో బైకు పెట్రోల్ పైపును లీక్ చేసి నిప్పు పెట్టడం తో పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.దీంతో వెంటనే స్పందించిన పోలీసులు మంటలు అదుపులోకి తెచ్చి రాకేష్‌ను అదుపులోకి తీసుకుని,వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube