ప్రియుడితో ఉన్న భార్యపై కోపంతో భర్త ఏం చేశాడో తెలుసా? కొడుకులను పక్కకు తీసుకు వెళ్లి, పెట్రోల్‌తో...!  

Man Sets Wife, Paramour On Fire After Catching Them Red Handed-

చేవెళ్లకు చెందిన భాగ్యలక్ష్మికి పది సంవత్సరాల క్రితం రవితో వివాహం అయ్యింది.వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవికి భార్యతో ఎప్పుడు గొడవలే...

Man Sets Wife, Paramour On Fire After Catching Them Red Handed--Man Sets Wife Paramour On Fire After Catching Them Red Handed-

ఇద్దరి మద్య గొడవలు పెరిగి పెద్దవి అవ్వడంతో గత కొంత కాలంగా ఇద్దరు విడి విడిగా ఉంటున్నారు.భర్త నుండి విడిగా ఉంటున్న భాగ్యలక్ష్మి పాతికెళ్ల కుర్రాడితో వివాహేతర సంబంధంను నెరపుతోంది.ఆ విషయం రవికి తెలిసి మండి పోయాడు.

ఆ కుర్రాడి వల్లే తనతో పదే పదే గొడవ పెట్టుకునేదంటూ అతడికి అనుమానం వచ్చింది.

Man Sets Wife, Paramour On Fire After Catching Them Red Handed--Man Sets Wife Paramour On Fire After Catching Them Red Handed-

తాజాగా ఆదివారం భాగ్యలక్ష్మితో పాటు ఆ కుర్రాడు ఇంట్లో ఉన్నాడని రవి తెలుసుకున్నాడు.రాత్రి సమయంలో అవ్వడంతో అంతా కూడా నిద్రిస్తున్నారు.

చాటుగా భాగ్యలక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి చూసిన రవికి ఆ కుర్రాడు కనిపించాడు.ఇద్దరు కలిసి ఉండటంను గమనించిన రవి ఆవేశంతో ఊగిపోయాడు.పక్క రూంలో ఉన్న తన కొడుకులను పక్క ఇంటికి తీసుకు వెళ్లాడు.

అక్కడ పడుకోబెట్టి, ఒక క్యాన్‌లో పెట్రోలు తీసుకుని వచ్చి భాగ్యలక్ష్మి మరియు ఆ కుర్రాడు ఉన్న రూంలో పోసి నిప్పు అంటించాడు.

పెట్రోలుతో ఒక్కసారిగా గదిలో మంటలు వ్యాప్తి చెందాయి.చిన్నపాటి కాలిన గాయాలతో ఆ కుర్రాడు బయటకు వచ్చాడు.కాని ఆమె మాత్రం రాలేక పోయింది.

అతడిని హాస్పిటల్‌లో జాయిన్‌ చేసిన స్థానికులు, అప్పటికే భాగ్యలక్ష్మి మృతి చెందినట్లుగా గుర్తించారు.పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఆమె పూర్తిగా కాలిపోయి, కనీసం గుర్తు పట్టనంతగా మారిపోయింది.భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెను చంపేసి, రవి కూడా జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది...

దాంతో ఇద్దరు పిల్లలు కూడా అనాధలయ్యారు.

క్షణికావేశంలో గొడవలు, అక్రమ సంబంధాల వల్ల పిల్లలు అనాధలు అవుతారనే విషయం తెలిసినా కూడా జనాలు ఇలా చేస్తూ మళ్లీ మళ్లీ ఎంతో మంది పిల్లలను అనాధలుగా మిగుల్చుతున్నారు.రవి, భాగ్యలక్ష్మిల జీవితాన్ని చూసి అయినా మరి కొందరు బాగు పడాలని ఆశిద్దాం.