ముంబై మార్కెట్ లో చీర్ డ్యాన్స్,ఫిదా అవుతున్న నెటిజన్లు

ఈ రోజు,రేపు అంతా కూడా సామజిక మాధ్యమాల ద్వారానే జీవితం వెళ్లదీస్తున్నారు అని చెప్పాలి.ఇంట్లో మనుషులు లేకపోయినా పరల్లేదు కానీ, ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతె మాత్రం ఇక అది ఇల్లు కాదు అన్న లెక్క లోకి వచ్చేస్తున్నారు జనాలు.

 Man Selling Coriander Leaves Like Cheerleader In Mumbai,coriander Leaves,man,mum-TeluguStop.com

ఇప్పుడు అయితే మరీ దారుణం కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడం తో ఎవరూ కూడా బయటకు కదలకుండా ఇంట్లోనే ఉంటూ ఇక ఈ సోషల్ మీడియా ను ఒక రేంజ్ లో వాడుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి రోడ్డుపైనే చీర్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

అసలుకే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు ఇంకా ప్రారంభం కాకుండానే ఈ చీర్ డ్యాన్స్ ఏంటి అని అనుకుంటున్నారా.ఈ ఘటన మహారాష్ట్ర ముంబై లోని మార్కెట్ లో చోటుచేసుకుంది.

కరోనా తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే.కరోనాకు భయపడి ప్రజలు దాదాపుగా బయటకు కూడా రాకుండా ఇళ్లకే పరిమితమౌతున్నారు.

ఒకవేళ బయటకు వచ్చినా అవసరమైన పని చూసుకొని వెంటనే ఇళ్లకు వెళ్లిపోతున్నారు.గతంలో మాదిరిగా నాలుగు చోట్ల తిరిగి కావాల్సినవి వస్తువులు కొనుగోలు చేయడం అనేది మానేశారు.

దొరికిన చోటనే ఒక రూపాయి ఎక్కువ అయినా పర్లేదు అనుకోని కొనేసుకుంటున్నారు.దీనితో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలే ఈ లాక్ డౌన్ సమయంలో మూతపడ్డాయి.

ఇక చిన్న చిన్న వ్యాపారుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.ఈ మహమ్మారి దేశంలో కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం విదితమే.

ముఖ్యంగా మహారాష్ట్ర,ఢిల్లీ,తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉంది.దీనితో చాలా మంది కూడా నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసమే బయటకు వస్తున్నారు.

కూరగాయల ధరలు కొన్ని చోట్ల కొండెక్కాయి.మహారాష్ట్రలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అక్కడే కరోనా కేసులు అత్యధికంగా ఉండడం తో అక్కడ ప్రజల పరిస్థితి మరింత అద్వానంగా ఉంది.

ఇప్పటికే ఒక్క ముంబై నగరంలోనే కరోనా కేసులు 70వేలకు పైగా ఉన్న సంగతి తెలిసిందే.

అక్కడ ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలన్నా భయపడుతున్నారు.దీంతో ఓ కొత్తిమీర వ్యాపారి తన దగ్గర ఉన్న కొత్తిమీరను అమ్మెందుకు చీర్ డ్యాన్సర్ అవతారం ఎత్తాడు.

ఐపీఎల్ మ్యాచ్ లలో చీర్ గర్ల్స్ గానీ కలర్ ఫుల్ పేపర్స్ తో ఎలా అయితే డ్యాన్స్ చేస్తారో సేమ్ అలానే ఆ వ్యాపారి కొత్తిమీర కట్టను పట్టుకొని డ్యాన్స్ చేస్తూ అమ్మడం మొదలుపెట్టాడు.దీనితో ఐపీఎల్ వాయిదా పడటంతో ఈ వ్యాపారి చేసిన చీర్ డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube