మూవింగ్ ట్రైన్‌పై పరిగెత్తిన వ్యక్తి.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

కదులుతున్న ట్రైన్ పై( Moving Train ) ఎక్కడ చాలా ప్రమాదకరం.రైలు పట్టాలపై వెళ్తున్నప్పుడు చాలా కుదుపులకు లోనవుతుంది.

అందువల్ల దానిపైన ఉన్నప్పుడు కింద పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అంతే కాదు పక్కన పైన ఉన్న ఏవైనా ఆబ్జెక్ట్స్ గుద్దుకునే ప్రమాదం కూడా ఉంది.

ఇంకా చావుకు దారి తీసే ఎన్నో రిస్క్స్ కూడా పొంచి ఉంటాయి.అయినా కొంతమంది ట్రైన్ పైకి ఎక్కి పిచ్చి పనులు చేస్తుంటారు దాచాక మరొక వ్యక్తి ఇలా చేస్తూ కెమెరాకు అడ్డంగా చిక్కాడు.

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

Advertisement

కదులుతున్న రైలు పైకప్పుపై( Train Rooftop ) ఈ వ్యక్తి పరిగెడుతూ కనిపించడం వీడియోలో మనం చూడవచ్చు.పాపులర్ మొబైల్ గేమ్ "సబ్వే సర్ఫర్"లో( Subway Surfers ) ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ పరిగెడుతూ ఉంటుంది.సేమ్ అలాగనే ఇతడు పరిగెడుతూ కనిపించాడు.

గేమ్ లో ఇది ఫన్ గా ఉన్నా రియల్ లైఫ్ లో మాత్రం చాలా ప్రమాదకరమని గమనించాలి.వైరల్ అవుతున్న 16 సెకన్ల క్లిప్‌లో ఒక వ్యక్తి చొక్కా, లుంగీ, తల చుట్టూ ఎర్రటి కండువా ధరించి ఉండటం మనం గమనించవచ్చు,

రైలు ( Train ) ఒక స్టేషన్‌ నుంచి బయలుదేరుతున్నప్పుడు అతడు దాని రూఫ్ టాప్ పైకి ఎక్కాడు.నిలబడి నడుస్తూ ఉన్నాడు, ఆ సమయంలో అతడు కింద పడితే కాలు లేదా చేయు విరగడం ఖాయం.కొంతమంది ప్రయాణికులు ఈ స్టంట్ ను వారి ఫోన్‌లలో రికార్డ్ చేశారు.

ఇది ఇంకా రైల్వే అధికారుల దృష్టికి వచ్చిందా రాలేదా అనేది తెలియ రాలేదు ఒకవేళ వస్తే అతను ఎవరో త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి దీనిని మీరు కూడా చూసేయండి.

రైలులోని అమ్మాయిలపై నీళ్లు చల్లిన యువకుడు.. వీపు పగిలేలా కొట్టిన పోలీస్ (వీడియో)
Advertisement

తాజా వార్తలు