సినిమాల కోసం కొడుకుని వదిలించుకున్న తల్లి... కేసు పెట్టిన కొడుకు  

Man Seeks Rs 1.5 Cr From Mother For Abandoning Him 38 Yrs Ago - Telugu Abandoning Him 38 Yrs Ago, Bollywood Dreams, Man Seeks Rs 1.5 Cr From Mother, Mumbai

సినిమా మీద మోజు ఉంటే సొంత వారిని కూడా వదులుకొని వచ్చేయడానికి సిద్ధమైపోతారు.అలాగే సినిమాల పిచ్చితో ఓ మహిళా కన్న బిడ్డని ట్రైన్ లో అనాధగా వదిలేసి రంగుల ప్రపంచంలోకి వచ్చింది.

Man Seeks Rs 1.5 Cr From Mother For Abandoning Him 38 Yrs Ago

అయితే ఎన్నేళ్ళ తర్వాత తిరిగొచ్చి తన తల్లి గురించి తెలుసుకున్న ఆ కొడుకు ఇప్పుడు ఆమె మీద బొంబాయి కోర్టులో కేసు పెట్టాడు.తనని కనేసి అనాధగా సమాజంలో వదిలేసిన ఆమె నుంచి తనకి 1.5 కోట్లు కావాలని డిమాండ్ చేశాడు.ఈ కేసు ఇప్పుడు ముంబైలో సంచలనంగా మారింది.

శ్రీకాంత్ సబ్నిస్ అనే వ్యక్తి ఓ నటిని తన తల్లిగా పేర్కొంటూ వివరాలు చెప్పాడు.మా అమ్మ తొలుత దీపక్ సబ్నీస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.1979 ఫిబ్రవరిలో నేను జన్మించాను.సినిమాల్లో నటించాలని కలలు కన్న ఆమె నన్ను తీసుకుని ముంబైకి బయలుదేరింది.

అక్కడికి చేరుకున్నాక ట్రైన్‌లోనే వదిలేసి తన దారి తాను చూసుకుంది.ఆ తరువాత ఓ రైల్వే ఆఫీసర్ నన్ను అనాథశ్రమంలో చేర్పించాడు.1986 నేను అనాథాశ్రమంలో ఉన్నాని తెలుసుకున్న మా అమ్మమ్మ నన్ను చేరదీసింది.కొంత కాలం తరువాత మా అమ్మమ్మ నన్ను మరో బంధువుకు ఇచ్చేసింది.అక్కడే నేను పెరిగి పెద్ద వాడిని అయ్యాను.2017లో జరిగిన విషయమంతా తెలుసుకుని మా అమ్మను కలుసుకున్నాను.అప్పటికే ఆమె రెండో వివాహం చేసుకుంది.వారికి సంతానం కూడా ఉన్నారు.అయితే.నా విషయం సంతానికి చెప్పద్దంటూ ఆమె, ఆమె భర్త నన్ను వేడుకున్నారని శ్రీకాంత్ తెలిపాడు.

తన బాల్యాన్ని నాశనం చేసి తాను అనాధగా మారడానికి కారణమైన నా తల్లి నుంచి నష్టపరిహారం ఇప్పించాలని శ్రీకాంత్ కోరుతున్నాడు.అలాగే తన గురించి ప్రపంచానికి పరిచయం చేసి నేనే తన బిడ్డనని ఒప్పుకోవాలని డిమాండ్ చేశాడు.

మరి సదరు నటి కొడుకు అని చెప్పుకుంటున్న అతని డిమాండ్ ని ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Seeks Rs 1.5 Cr From Mother For Abandoning Him 38 Yrs Ago Related Telugu News,Photos/Pics,Images..

footer-test