కృతిసనన్ వల్ల నా జీవితం నాశనమైంది.. నెటిజన్ కామెంట్స్ వైరల్!

Man Says Kriti Sanon Ruined His Life Over Param Sundari Song

తెలుగు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ కృతి సనన్ బిజీ అయ్యారు.ఒకవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో, ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ లో కూడా నటిస్తూ కృతిసనన్ సత్తా చాటుతున్నారు.

 Man Says Kriti Sanon Ruined His Life Over Param Sundari Song-TeluguStop.com

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ నెటిజన్ల కామెంట్లకు తనదైన శైలిలో రియాక్ట్ అవుతుంటారు.

తాజాగా నెటిజన్ ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ను చూసి కృతిసనన్ నవ్వాపుకోలేకపోయారు.

 Man Says Kriti Sanon Ruined His Life Over Param Sundari Song-కృతిసనన్ వల్ల నా జీవితం నాశనమైంది.. నెటిజన్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కృతిసనన్ మిమి అనే సినిమాలో నటించగా ఆ సినిమాలోని పరం సుందరి అనే పాట హిట్ గా నిలిచింది.యూట్యూబ్ లో ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

అయితే ఒక నెటిజన్ పరం సుందరి పాట విడుదలైనప్పటి నుంచి తన స్నేహితులు తనను ఆట పట్టిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

స్కూల్ లో చదువుతున్న సమయంలో తనను ఏదీ ఇబ్బంది పెట్టలేదని తన పేరును, తన ఇంటి పేరును ఆటపట్టించిన వారిపై తనకు ఎటువంటి కోపం లేదని ఒక నెటిజన్ పేర్కొన్నారు.

పరమ సుందరి సాంగ్ రిలీజైన తర్వాత తాను 1,000 సార్లు వేధించబడ్డానని నెటిజన్ వెల్లడించారు.ఎందుకు ఈ విధంగా చేశావ్ కృతిసనన్.నా లైఫ్ ను ఎందుకు నాశనం చేశావంటూ నెటిజన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ ట్వీట్ గురించి కృతిసనన్ నవ్వే ఎమోజీలతో సమాధానం ఇస్తూ అయ్యో సారీ అని పేర్కొన్నారు.ట్వీట్ చేసిన ఆ ట్విట్టర్ యూజర్ పేరు పరం ఛాయా కావడం గమనార్హం.ఏఆర్ రెహమాన్ పరం సుందరి సాంగ్ ను కంపోజ్ చేయగా శ్రేయా ఘోషల్ పాడారు.మిమీ సినిమాలో కృతిసనన్ సరోగసి మదర్ గా కనిపించారు.

#Mimi #Ar Rehman #Netizen Tweet #Tweet #Param Sundari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube