చెట్లు కాపాడటానికి దేవుడు సాయం... కొత్త ప్రయత్నంతో అద్బుత ఫలితం

జనాభా పెరగడంతో పాటు, కాలుష్యం, వాతావరణ మార్పులు, నివాసాల కోసం అడవులని విపరీతంగా నాశనం చేసేస్తున్నాం.మరోవైపు మైనింగ్ మాటున వేల ఎకరాల అడవులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

 Man Saves1000trees Help Of God-TeluguStop.com

పచ్చదనం ఇలా హరిన్చుకుంటూ పోతే కొంత కాలానికి భూమి మీద ఆక్సిజన్ దొరకడం కష్టం అయిపోతుందని`పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఓ వైపు అడవుల సంరక్షణకి పిలుపునిస్తూ, మరో వైపు ఉన్న చెట్లుని కాపాడుకుంటూ, మొక్కలని విపరీతంగా పెంచాలని కోరుతున్నారు.

ఢిల్లీ లాంటి నగరాలలో చెట్లు లేకపోవడం వలన వాతావరణంలో కాలుష్యం ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు.ఇక ఈ పరిస్థితి తమ గ్రామంలో రాకూడదని ఉత్తరప్రదేశ్ లో నగవా పంచాయితీలో ఓ కొత్త ఆలోచనకి ఆ గ్రామ పెద్ద శ్రీకారం చుట్టాడు.

మారుమూల గ్రామాల్లోని ప్రజలు కనిపించిన ప్రతి చెట్టుని నరికేస్తున్నారు.వారికి వాతావరణంలో కాలుష్యం గురించి చెప్పిన నిరక్షరాస్యత కారణంగా చాలా వరకు అర్ధం కాదు.కావాలని తమని కలప కొట్టుకోకుండా అడ్డుకుంటున్నారని భావిస్తారు.వారి పంథాలో వాళ్ళు వెళ్తారు.

ఈ నేపధ్యంలో వారిలో మార్పు తీసుకురావాలని భాగించిన నగవా పంచాయితీ పెద్ద ప్రాగ్ దత్ సరికొత్త ఆలోచన చేశాడు.చెట్లు కొట్టకుండా ఉండేందుకు దేవుడు సాయం తీసుకున్నాడు.

ఆ గ్రామంలో ఉన్న అన్ని చెట్ల మీద దేవుడు బొమ్మలను చిత్రించాడు.దీంతో గ్రామంలో ప్రజలు వంటిని దైవ స్వరూపాలుగా భావించి కొట్టడం మానేశారు.

వాటికి ఇంకా పూజలు చేయడం కూడా మొదలెట్టారు.దీంతో తన ప్రయత్నం ఫలించిందని ఇప్పుడు పరాగ్‌దత్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

ఇప్పటి వరకూ అతను తన ప్లాన్ తో 1000కిపైగా చెట్లను కాపాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube