6వ అంతస్తు కిటికీకి వేలాడుతున్న చిన్నారి.. కలకలం రేపిన ఘటన

కిటికీ దగ్గర ఆడుతూ ఆడుతూ ఓ చిన్నారి ఆరవ అంతస్తు కిటికీ నుంచి ప్రమాదవశాత్తు వెనక్కి జారిపడిపోయింది.ఈ క్రమంలో ఆ చిన్నారి.

 Man Saves Girl Hanging On The Sixth Floor Of A Building Viral Video Details, Kid-TeluguStop.com

కిటికీ గ్రిల్‌ను గట్టిగా పట్టుకొని వేళాడుతూ ఉంది.కొంచెం ఆలస్యమైనా ఆ చిన్నారి పట్టుతప్పి కిందపడిపోయేది.

అయ్యో పాపం అంటూ హడావుడి చేశారే కానీ ఏ ఒక్కరూ ఆ చిన్నారిని రక్షించేందుకు సరైన చర్యలు తీసుకోలేదు.కానీ, అప్పుడే ఓ వ్యక్తి దేవుడిలా అటువైపు వచ్చాడు.

క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగాడు.తన గురించి ఆలోచించకుండా ఆ చిన్నారి ప్రాణాలు ఎలాగైనా కాపాడాలనే లక్ష్యంతో సాహసం చేశాడు.

చివరికి ఆ చిన్నారిని రక్షించి హీరో అయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.

పెంగ్ అనబడే ఆఫ్ డ్యూటీ అగ్నిమాపక సిబ్బంది అటువైపుగా వెళ్తుండగా.వారికి జనాల హాహాకారాలు వినిపించాయి.

ఏం జరిగిందా అని చూస్తే.అక్కడ ఓ చిన్నారి ఆరవ అంతస్తు కిటికీకి వేలాడుతూ కనిపించింది.

అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.దాంతో అతడు.

వెంటనే అలర్ట్‌ అయ్యాడు…ఆమెను రక్షించడానికి పరుగెత్తాడు.

వెంటనే, అతను ఆరు అంతస్తులు పైకి ఎక్కి, గాలిలో శరీరం ఊపుతున్న చిన్నారిని పట్టుకున్నాడు.కొద్ది నిమిషాల తర్వాత బాలిక తల్లి ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా కిందకు దింపింది.పెంగ్‌ ధైర్యంగా ముందుకు వచ్చి సాహాసం చేయటంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

దాంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.పాప తల్లిదండ్రులు పెంగ్‌ను కొనియాడారు.

అతడు చేసిన సాహసానికి స్థానికులు ఫిదా అయ్యారు.అంతా అతడిని ప్రశంసలతో ముంచెత్తారు.

ఏది ఏమైనా.ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉన్నారంటే నిజంగా మెచ్చుకోవల్సిందే కదూ.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.మీరు రియల్ హీరో అంటూ నెటిజన్లు పెంగ్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube