పెంపుడు కుక్క కోసం ఇతడు చేసిన సాహసంకు ఎవరైనా హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే  

  • కొన్ని రోజుల క్రితం ఒక పెంపుడు పిల్లి దాని యజమానుల ప్రాణాలు కాపాడిన విషయం వైరల్‌ అయిన విషయం తెల్సిందే. పక్కన ఉన్న ల్యాబ్‌లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ లీక్‌ అవుతున్న విషయాన్ని కనిపెట్టిన పిల్లి గొంతు పోయేలా అరిచి అరిచి యజమానులను నిద్ర లేపింది. ఆ విషయం కాస్త పెద్ద వైరల్‌ అయ్యింది. యజమానుల ప్రాణాలను అప్పుడు పిల్లి కాపాడితే ఈసారి తాము పెంచుకుంటున్న కుక్క పిల్లి ప్రాణాలను తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యజమాని కాపాడాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  • పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికాలోని సౌత్‌ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న జోస్‌ అనే వ్యక్తి ఒక కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. దానికి గబానా అనే పేరు పెట్టుకున్నాడు. ఎంతో అల్లారు ముద్దుగా దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. గబానా కూడా జోస్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ ఉండేది. అంతా హ్యాపీగా సాగుతున్న సమయంలో జోస్‌ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న జోస్‌ వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కొద్ది సమయంకు తన కుక్కపిల్ల గబానా లోపలే ఉందని గుర్తించిన జోస్‌ వెంటనే మళ్లీ లోనికి వెళ్లాడు. అప్పటికే మంటలు మరింత పెరిగాయి.

  • Man Runs Inside His Burning Home To Save Dog Internet Hearts Viral-Burning Internet Viral Jose Guzman

    Man Runs Inside His Burning Home To Save His Dog Internet Hearts Viral

  • మంటలు సెకను సెకనుకు పెరిగి పోతున్నాయి. అయినా కూడా జోస్‌ ఆ విషయాన్ని ఆలోచించకుండా గబానా ఎక్కడ ఉందో చూసి దాన్ని పట్టుకుని బయటకు వచ్చాడు. ఆ క్రమంలో మొహం మరియు చేతులకు గాయాలు కూడా అయ్యాయి. మరో నిమిషం ఆలస్యం అయితే జోస్‌ మరింతగా కాలి పోయి ప్రాణాలకే ప్రమాదం సంభవించేది అంటూ స్థానికులు అంటున్నారు. జోస్‌ తన పెంపుడు కుక్క పిల్ల గబానా కోసం చేసిన సాహసంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జోస్‌కు ప్రపంచ వ్యాప్తంగా హ్యాట్సాప్‌ చెబుతున్నారు.