వైరల్ వీడియో : ఈ డ్రైవర్‌ డ్రైవింగ్ స్కిల్స్ కి అవాక్కవ్వాల్సిందే!

సాధారణంగా కారు డ్రైవింగ్ చేసేవాళ్లకు కారు పార్కింగ్ విషయంలో వింత అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి.కారును ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం సాధ్యం కాదు.

 Man Reverses Car From A Narrow Parking Spot Video Goes Viral, Reversing Car, Car-TeluguStop.com

ఎక్కువ ప్రదేశం ఉంటే మాత్రమే కారును పార్కింగ్ చేయడం వీలవుతుంది.అలా అని చెప్పి మనం ఉండే ప్రదేశానికి చాలా దూరంలో కారును పార్క్ చేయలేం.

అయితే బాగా కారు డ్రైవింగ్ వచ్చిన వాళ్లు మాత్రం తక్కువ స్థలంలో కూడా కారును పార్కింగ్ చేయగలరు.

తాజాగా ఒక కారు డ్రైవర్ కారు పార్కింగ్ విషయంలో తన స్కిల్ ను ప్రూవ్ చేసుకున్నాడు.

దీంతో నెటిజన్లు కారు డ్రైవర్ టాలెంట్ కు ఫిదా కావడంతో పాటు డ్రైవర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముందు గొయ్యి, వెనుక గొయ్యి ఉన్నా ఆ డ్రైవర్ మాత్రం ధైర్యంగా మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కారును పార్క్ చేశాడు.

అక్కడ కారును పెట్టడం కానీ తీయడం కానీ అంత సులువు కాదు.ఏ మాత్రం తేడా జరిగినా కారు గొయ్యిలో పడిపోతుంది.

అయితే కారు డ్రైవర్ కారును తీయడానికి, పెట్టడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోకపోవడం గమనార్హం.డ్రైవర్ తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అవుతుండగా వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.

కొందరైతే కారును ఇలా కూడా పార్క్ చేయవచ్చా అని కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ డ్రైవర్ అడ్రస్ తెలిస్తే తాము అతని దగ్గర కారు డ్రైవింగ్ నేర్చుకుంటామంటూ పోస్టులు పెడుతున్నారు.

అసాధ్యమైన పనిని సైతం ఈ డ్రైవర్ సుసాధ్యం అని నిరూపించాడని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే తెలివి, సూక్ష్మ బుద్ధి ఉంటే అసాధ్యాలను కాదు సుసాధ్యం చేయవచ్చని ఈ డ్రైవర్ ప్రూవ్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube