బుర‌ద గుంత‌లో ఇరుక్కున్న ఆవును కాపాడిన వ్య‌క్తి.. ప్ర‌శంసిస్తున్న నెటిజ‌న్లు

Man Rescues Cow Trapped In Mud Pit Appreciated Netizens

మాన‌వ స‌మాజంలో అనేక అంత‌రాయాలు ఉన్నాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.మ‌నిష‌న్న వాడికి కులం, మ‌తం క‌న్నా కూడా మాన‌వ‌త్వం అనేది అత్యంత ముఖ్య‌మైన అంశం అని ఇప్ప‌టికే ఎంద‌రో మ‌హానుభావులు నిరూపించారు.

 Man Rescues Cow Trapped In Mud Pit Appreciated Netizens-TeluguStop.com

అలాంటి వారిని చూసి అయినా మ‌న‌మంతా ఒక్క‌టే అని గుర్తించ‌లేక‌పోతున్నాము.అయితే ఇప్ప‌టికీ చాలా చోట్ల మ‌తాల పేరుతో కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

అలాంటి వారికి ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే వీడియో ఎంతో నేర్పుతుంది.ఎందుకంటే ఈ వీడియో చూసిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ త‌మ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.

 Man Rescues Cow Trapped In Mud Pit Appreciated Netizens-బుర‌ద గుంత‌లో ఇరుక్కున్న ఆవును కాపాడిన వ్య‌క్తి.. ప్ర‌శంసిస్తున్న నెటిజ‌న్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌న దేశంలో ఆవులు అన‌గానే హిందువుల‌కు సంబంధించిన అత్యంత ప‌విత్ర‌మైనదిగా గుర్తిస్తారు.అయితే ఇప్పుడు ఆవుల ప‌రిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.

వాటి ఆల‌నా పాల‌నా పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు.అయితే ఇప్పుడు ఓ ఆవు బుర‌ద‌లో ఇరుక్కుంటే దాన్ని ఓ ముస్లిం వ్య‌క్తి కాపాడ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

దీన్ని చూసిన వారంతా కూడా ఇలాంటి స్ఫూర్తి ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం అని చెబుతున్నారు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఇందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

ఓ రోడ్డు ప‌క్క‌న అనుకోకుండా ఓ ఆవు బుర‌ద గుంతలో పడింది.ఇక దాని నుంచి బ‌య‌ట‌కు రావడానికి ఎంత ట్రై చేసినా బ‌య‌ట‌కు రాలేక పోతుంది.ఇక దాన్ని గమనించిన ఓ ముస్లిం యువకుడు వెంట‌నే రంగంలోకి దిగిపోయాడు.

ఎలాగైనా ఆవును కాపాడాల‌ని ఏకంగా గుంతలోకి దిగిపోయాడు.ఆవును త‌న బ‌ల‌మంతా ఉప‌యోగించి బ‌య‌ట‌కు వ‌చ్చేలా సాయం చేశాడు.

దీన్నంతా కూడా ఓ వ్య‌క్తి వీడియో తీసి నెట్టింట్లో వ‌దిలారు.ఇంకేముంది క్ష‌ణాల్లోనే అంద‌రి మ‌న‌సుల‌ను దోచుకుంటోంది.

అంద‌రూ ఎమోష‌న‌ల్ కామెంట్లు పెడుతున్నారు.

#Cow Mud #Cow Struck Mud #Netizens #Saved Cow

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube