ఆలస్యం అమృతం విషం అంటారు... ఇతడి విషయంలో 2 నిమిషాల ఆలస్యం ఆయన ప్రాణాలు కాపాడింది

తెలుగులో ప్రముఖ సామెతలు కొన్ని సార్లు నూటికి నూరు పాళ్లు నిజమే అనిపిస్తాయి.పెద్దలు ఆలస్యం అమృతం విషం అంటారు.

 Man Reaches 2 Mins Late To The Airport Escapes Ethiopian Crash-TeluguStop.com

అంటే ఆలస్యం అనేది అమృతంలా మంచిది అని, అదే సమయంలో చెడ్డది అని కూడా అర్థం వస్తుంది.అయితే గ్రీస్‌కు చెందిన ఆంటోనిస్‌ అనే వ్యక్తి పట్ల ఆలస్యం అనేది అమృతం అయ్యింది.

ఆయన ఆలస్యం వల్ల ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాడు.లేదంటే ఆయన కరెక్ట్‌ సమయానికి కనుక అనుకున్నట్లుగా ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లి ఉంటే ఆయన ప్రాణాలు అనంత వాయియుల్లో కలిసి పోయేవి.

ఇథియోపియాలో అత్యంత దయనీయమైన విమాన ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే.157 మంది ఉన్న విమానం కుప్పకూలిపోవడంతో అందులోని ప్రతి ఒక్కరు మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.అయితే ఆ విమానంలో ప్రయాణించాల్సిన ఆంటోనిస్‌ మావ్రోపౌలస్‌ అనే వ్యక్తి ఆలస్యం అవ్వడం వల్ల ఆ విమానం ఎక్కలేదు.నిర్ణీత సమయంకు రెండు నిమిషాల ఆలస్యంగా అతడు విమానాశ్రయం వద్దకు చేరుకున్నాడు.

అయితే అప్పటికే అనౌన్స్‌ మెంట్‌ చేయడంతో పాటు టేకాఫ్‌కు సిద్దం అయ్యింది.

విమానం టేకాఫ్‌ అయిన విషయం తెల్సిన ఆ వ్యక్తి అయ్యో అనుకుంటూ ఉన్న లోపే విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయిన విషయం విమానాశ్రయం వద్దకు చేరింది.టేకాఫ్‌ అయిన ఆరు నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది.అక్కడ నుండి వెళ్లి పోబోతున్న ఆ వ్యక్తికి విషయం తెలియడంతో బాబో అని గుండెలు పట్టుకున్నాడు.

తృటిలో తన ప్రాణం మిగిలిందని ఒకింత ఆనందం వ్యక్తం చేశాడు.ఆలస్యం రావడం, ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నట్లుగా ఆయన చెబుతున్నాడు.

ఆ సంఘటనను తల్చుకుంటేనే ఒల్లు భయంతో కంపిస్తుందని, రెండు నిమిషాల ఆలస్యం నా జీవితంను నిలిపిందని, ఆలస్యం వల్ల అనర్థాలు జరగవని ఆయన అంటున్నాడు.మొత్తానికి తృటిలో ప్రాణాలు దక్కించుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆంటోనిస్‌ అత్యంత అదృష్టవంతుడిగా పేరు దక్కించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube