పెట్రోల్ ధర రూ.100 దాటిందని ఒక వ్యక్తి వినూత్న నిరసన.. ఫోటో వైరల్..

పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు ఎప్పుడు లేనంతగా రికార్డు స్థాయిలో పెంచుతున్నారు.మధ్యప్రదేశ్ లో ఏకంగా 100 రూపాయల మార్క్ ను టచ్ చేసి మొదటి సారి సెంచరీ సాధించింది.

 Man Protests With Cricket Bat As Petrol Price Hits Century In Bhopal, Petrol Pri-TeluguStop.com

ఈ ధరలు విని వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.మరోవైపు చమురు ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

పెట్రోల్ ధర రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుంది.పేద, మధ్యతరగతి ప్రజలకు పెట్రోల్ ధర కంటతడి పెట్టించేలా ఉంది.రోజురోజుకూ పెరుగుతూ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.ఈ మధ్య పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.75 రూపాయలు నుండి 85 రూపాయలు మధ్య ఉండే పెట్రోల్ ఏకంగా 100 రూపాయలకు చేరింది.

రోజురోజుకూ భగ్గుమంటున్న చమురు ధరలు వాహనదారుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి.మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో శనివారం రోజు పెట్రోల్ ధర ఏకంగా 100.04 రూపాయల మార్క్ దాటింది.పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరినందుకు ఒక వ్యక్తి వినూత్న పద్దతిలో తన నిరసన తెలియచేసాడు.

Telugu Rupees, Bhopal, Century Batsman, Helmet, Petrol, Variety, Congress-Latest

పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి ఒక చేతిలో బ్యాట్, మరొక చేతిలో హెల్మెట్ పట్టుకుని రెండు చేతులూ పైకి ఎత్తి సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ లాగా నిలబడ్డాడు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్స్ మెన్ హెల్మెంట్ తీసి బ్యాట్ పైకి లేపి ఎలా చూపిస్తారో.

అలానే ఆ వ్యక్తి పెట్రోల్ ధర కూడా సెంచరీ చేసిందని చెప్పడం కోసం ఒక చేతిలో బ్యాట్ మరొక చేతిలో హెల్మెంట్ తీసుకుని చేతులు రెండు పైకి లేపుతూ తన నిరసన వ్యక్తం చేసాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

అయితే ఈ వ్యక్తి యూత్ కాంగ్రెస్ ప్రతినిధి అని తెలిసింది.ఈ ఫోటోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ.

కామెంట్లతో దుమ్ములేపుతున్నాడు.ఒకవైపు ప్రభుత్వాన్ని పరోక్షముగా తిడుతూనే.

మరోవైపు కామెడీ చేస్తున్నారు.ఒక్క మధ్య ప్రదేశ్ లోనే కాకుండా మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

ఇలానే కొనసాగితే ప్రజలు ముందుముందు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube