ఇలా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి మాత్రం ఒకె చెప్పదు చెప్పండి..  

Man Proposes To Sci-fi Fan Girlfriend In A Crop Circle-

అమ్మాయిని ప్రేమిస్తే సరిపోదు.తనకు ప్రపోజ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి..

Man Proposes To Sci-fi Fan Girlfriend In A Crop Circle--Man Proposes To Sci-fi Fan Girlfriend In A CROP CIRCLE-

చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేయడానికి భయపడి వన్ సైడ్ ప్రేమికులుగా మిగిలిపోతుంటారు.ప్రపోజ్ అనగానే మీకు ముందుగా గుర్తొచ్చేది గులాబీలు.లేదంటే ప్రేమలేఖలు కానీ అదంతా ఒకప్పుడు.

కానీ ఇప్పుడు కాలం మారింది ప్రేమికురాలికి ప్రపోజ్ చేయడానికి కొత్తకొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.వాటి ద్వారా అమ్మాయి ఒకె చెప్తే ఒకె.చెప్పకపోయినా ఒకె.

వారి వెరైటీ ప్రపోజల్స్ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారుతున్నాయి.అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మన హీరో ప్రపోజల్ కి అమ్మాయి వెంటనే ఒకె చెప్పింది…అలా ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఏంటి.ఏ అమ్మాయైనా ఒకె చెప్తుంది అంటారా??ఇంతకీ మనోడు ఏం చేశాడో తెలుసా??

భారత సంతతికి చెందిన 28 ఏళ్ల వరుణ్ భానోత్ గర్ల్‌ఫ్రెండ్ అనిషా సేథ్‌కు అతడు వెరైటీగా ప్రపోజ్ చేశాడు…వరుణ్ ,అనీషాల మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉన్నా ప్రేమ విషయం చెప్పడానికి భయపడ్డాడు వరుణ్.ప్రపోజ్ చేశాక ఒకె చెప్తే పర్లేదు.

కానీ నో చెప్తే ఉన్న స్నేహం కూడా బెడిసికొడుతుందని భయపడ్డాడు..

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి.

కానీ ఎట్టకేలకు ధైర్యం చేసి ప్రపోజ్ చేయాలని ఫిక్సయ్యాడు.కానీ తనకి నేరుగా చెప్పలేక.వెరైటీగా ఏదైనా చేయాలనుకున్నాడు.

అందుకోసం బ్రిటిన్‌లోని చెషైర్‌లో మొక్కజొన్న పొలాన్ని ఎంచుకున్నాడు.మూడు నెలలు పాటు కష్టపడి ‘అనీషా మ్యారీ మీ?’ అనే పదాలను కనిపించేలా పంటను బహు సుందరంగా కత్తిరించేయించాడు.

వరుణ్ మనసులో ఉన్న ప్రేమంత అందంగా కత్తిరించారు ఆ పదాలను రైతులు.

తర్వాత తన బర్త్ డే రోజున అనీషాను హెలికాప్టర్లో ఎక్కించుకుని పొలంపై చక్కర్లు కొట్టాడు.అంతవరకు ఈ ప్రపోజ్ సంగతి ఆమెకు చెప్పలేదు.

హెలికాప్టర్ 200 అడుగులు ఎత్తుకు వెళ్లింది.పొలంలో కనిపించిన వరుణ్ కోరికను చూసి అనీషా ఫ్లాట్ అయిపోయి అతన్ని కౌగిలించేసుకుంది.అంతే.హెలికాప్టర్లోనే ఆమె వేలికి ఉంగరం తొడిగేశాడు…అతగాడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంతే తర్వాత కథ మేం చెప్పక్కర్లేదనుకుంటా.అయితే ఈ తతంగాన్నంతా వరుణ్ వీడియో తీయించాడు వరుణ్.ఇప్పుడు వీరి ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ టాఫిక్ గా మారింది..