వైరల్: కోమాలో నుంచి కోలుకున్న అమ్మాయికి ఏకంగా..?

ఈ కాలంలో నిజమైన ప్రేమ అనేది దొరకడం చాలా కష్టం అనే చెప్పాలి.కొందరు అందాన్ని చూసి ప్రేమిస్తే మరికొందరు డబ్బును చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు.

 Man Proposes To Girlfriend Right She Wakeup From Coma, Chicago, Man Proposes To-TeluguStop.com

అలా అని అందరిది అలాంటి ప్రేమ అని చెప్పడం లేదు.ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైన ప్రేమ.

ఈ రోజుల్లో కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి.చిన్న చిన్న కారణాలతోనే ప్రేమించుకున్నవాళ్ళు, పెళ్లయిన వాళ్ళు సైతం విడిపోతున్నారు.

కానీ ఈ ప్రేమజంట గురించి తెలిస్తే మీరే షాక్ అవుతారు.వీళ్ళ స్వచ్ఛమైన ప్రేమకు చేతులెత్తి మరి నమస్కారం పెడతారు.

ప్రేమించిన యువతికి జబ్బు చేసి కోమాలోకి వెళితే.తాను కోలుకునే వరకు ఎదురుచూసి మరి ఆమెకి రింగ్ తొడిగి మరి తన ప్రేమను చాటుకున్నాడు.

కోమాలో ఉన్న ఆ యువతి తల్లే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారిపోయింది.మరి ఆ ప్రేమజంట కధ ఏంటో ఒకసారి తెలుసుకుందామా.

ఫిలిప్పైన్స్ కు చెందిన విక్టోరియా అనే యువతీ ప్రస్తుతం చికాగోలో ఉంటుంది.అయితే విక్టోరియాకు 2016 వ సంవత్సరంలో లూపస్ అనే సిండ్రోమ్ తో బాధపడుతుంది.ఆ సిండ్రోమ్ రాకముందే స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్ అనే ప్రమాదకరమైన స్కిన్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంది.ఈ రెండు వ్యాధుల కారణంగా ఆమె గత 3 సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటున్నప్పటికీ విక్టరియా కోమాలోకి వెళ్లిపోయింది.

విక్టోరియాను ప్రేమించిన నికోలస్ మాత్రం ఆమె కోసం అలానే ఎదురుచుడసాగాడు.విక్టోరియా అంటే అమితమైన ప్రేమ ఉన్న నికోలస్ ఎప్పటికన్నా ఆమె కోలుకుంటుందని ఎదురుచూడసాగాడు.

ఆమె కోలుకుంటుందన్న విషయం తెలిసి ఆమెకు లవ్ ప్రపోజల్ పెట్టి త్వరలోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.విక్టోరియా పూర్తిగా కోలుకున్న తరువాత ఈ జంట ఒక్కటి అవ్వనున్నారు.

తమ అమ్మాయికి ఇంత మంచి ప్రేమికుడు భర్తగా రాబోతున్నందుకు విక్టోరియా అమ్మానాన్నలు ఎంతో సంబర పడిపోతున్నారు.ఈ క్రమంలో నికోలస్ మాట్లాడుతూ.విక్టోరియా హాస్పిటల్‌ లో ఉన్నప్పుడు అంతా మంచే జరుగుతుందని ఆమెకి సర్ది చెప్పేవాడిని అని, అలాగే ప్రతి రోజూ ఆమె ఆరోగ్యం ఎలా ఉందని డే టూ డే అప్ డేట్ చేసుకునే వాడిని అని తెలిపాడు.ఏదైనా మంచి విషయం ఉంటే తప్పకుండా విక్టోరియాతో పంచుకునే వాడిని అని చెప్పాడు.

అలాగే ఈ క్రమంలో విక్టోరియా కూడా మాట్లాడుతూ.ఈ వీడియో మా జీవితాల్లో మర్చిపోలేని ఒక జ్ఞాపకం అని, నా ఆరోగ్యంగా బాగోలేని పరిస్థితుల్లో నికోలస్ నాకు అండగా ఉన్నాడని చెప్పింది.

ఇంతకన్నా మంచి భర్త నాకు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి అని చెప్పింది.విక్టోరియా కోమా నుంచి కోలుకున్నా గాని ఆమెకు వచ్చిన లుపుస్ అనే సిండ్రోమ్ మాత్రం పూర్తిగా తగ్గలేదు అంట.వచ్చే సంవత్సరం అన్ని బాగుంటే వీరిద్దరూ వాళ్ళ కుటుంభ సభ్యులను, స్నేహితులందరిని పిలిచి పెళ్లి చేసుకుని గ్రాండ్ గా పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.