హోటల్లో భోజనం చేయడం కోసం ప్రధానమంత్రి అవతారం ఎత్తాడు...

ఏదైనా పని జరగకపోయినా, జరగాల్సిన పని లేట్ అవుతున్నా గల్లీ బీట్ కానిస్టేబుల్ దగ్గరి నుండి ఎమ్మెల్యేలు,మంత్రులు వరకు నేను ఫలానా అని ,ఫలానా వ్యక్తి తాలుకా అని చెప్తూ పనులు చేయించుకోవడానికి చూస్తాం.దీంతో అప్పటివరకు పట్టించుకోని వారు కాస్తా అప్పుడు మాత్రం పని చేసి పెడుతుంటారు.

 Man Pretends To Be Moroccan Pm To Get Restaurant Reservation-TeluguStop.com

అలా ఒక వ్యక్తి ఏకంగా నేను ప్రధానమంత్రిని అని చెప్పుకున్నాడు.ఇంతకీ ప్రధానమంత్రి అవతారం ఎత్తి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా.

మొరాకోకి చెందిన ఇహబ్ నిక్స్ అనే బాలుడు ఇటీవల తండ్రితో కలసి స్థానిక రెస్టారెంటుకు వెళ్లాడు.అప్పటికే అది కిక్కిరిసిపోయింది.చాలాసేపు వేచి ఉన్నా సీట్లు దొరకలేదు.దీంతో ఇహబ్ తండ్రికి కోపమొచ్చింది.వెంటనే ‘ఏం తిక్కగా ఉందా? నేనెవరని అనుకున్నారు.ఈ దేశ ప్రధానమంత్రిని.

’ అని.ప్రధానమంత్రి కార్డు బయటికి తీశాడు.అంతే వెయిటర్లు జడుసుకున్నాడు.దగ్గరుండి మరీ వడ్డించారు.అతడు ప్రధానమంత్రా, కాదా అన్న డౌట్ రాలేదు.ఎందుకొచ్చిన గొడవ.

తనిఖీల కోసం ఇలా వచ్చి చచ్చాడేమో వెధవ.అనుకుని తిట్టుకుంటూ గౌరవంగా పనిచేసుకుపోయారు.

ప్రధానికి తాము వడ్డించామని గొప్పలు చెప్పుకోవడానికి అతనితో ప్లేట్‌పై సంతకం కూడా చేయించుకున్నారు.ఇహబ్ ఈ తతంగాన్ని వీడియోతీసి ట్వీట్ చేశాడు.

అయితే.తమ దేశ ప్రధాని ఎలా ఉంటాడో మొరాకన్లకు తెలియదా అని జనం ప్రశ్నిస్తున్నారు.అయినా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా అని కొందరు… తమ ప్రధాని గడ్డం తీసేసుకుని హోటల్‌కు వచ్చాడేమోనని పొరబడి ఉండొచ్చని మరికొందరు రిప్లై కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి మనోడి దెబ్బకి హోటల్ వాళ్లు ఫూల్స్ అయితే.

మనోడు ప్రధాని అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube