నట్టింట్లో బయటపడ్డ పురాతన బావి.. 20 ఏళ్లుగా దాచిపెడుతున్న యజమాని!

మనం ఎప్పుడు బావి లేదా నుయ్యి లను చూస్తేనే ఉంటాం.కానీ అవి ఎక్కడ ఉంటాయి.

 Man Preserves Medieval Well Inside His Home, Amazing, Viral, Social Media, Medie-TeluguStop.com

ఇప్పటి వరకు బావి మనం బయట మాత్రమే చూసి ఉంటాం.కానీ ఇప్పుడు చెప్పుకోబోయే బావి మాత్రం నట్టింట్లో ఉంది.

అసలు ఆ బావి ఇంట్లో ఎలా ఉంది.బావి ఉంటె ఇల్లు ఎలా కట్టారు.అని అనుకుంటున్నారా.ఆ మ్యాటర్ తెలియాలంటే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

ఆ ఇంట్లో బావి ఉండాల్సిన చోటులో లేదు.బయట ఉండాల్సిన బావి నట్టింట్లో ఉంది.

ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు.కానీ ఇది నిజం.

ఆ ఇంట్లో హాల్ లోనే పెద్ద బావి ఉంది.అసలు ఆ ఇంట్లోకి బావి ఎలా వచిందనేగా మీ డౌట్.

బావి వాళ్ళింట్లోకి వెళ్లడం కాదు.బావి ఉన్న దగ్గరే వారు ఇల్లు నిర్మించు కున్నారు.

కానీ ఆ విషయం వారికీ చాలా రోజుల వరకు తెలియదు.

ఈ సంఘటన ఇంగ్లాండ్ లో జరిగింది.

ఇంగ్లాండ్ లోని ప్లేమౌత్ లో ఒక ఇల్లు ఉంది.అందులో కొలీన్ స్టీర్ అనే 61 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు.

వాళ్ళు అందులోనే 24 సంవత్సరాలుగా ఉంటున్నారు.ఒక రోజు కొలీన్ లివింగ్ రూమ్ శ్రుభ్రం చేస్తున్నప్పుడు ఒక చోట ఎత్తుగా కనిపించే సరికి అతడికి అనుమానం వచ్చి చూసాడు.

అప్పుడు అతడికి ఒక పురాతన బావి కనిపించింది.

Telugu Medieval Well-Latest News - Telugu

ఆ బావి 33 అడుగుల లోతులో ఉంది.అందులో ఉన్న వ్యర్ధాలను అన్ని కొలీన్ మూడు రోజులు శ్రమించి మరి తొలగించాడు.అందులో వ్యర్ధాలు తీస్తున్నప్పుడు ఒక కత్తి కూడా అతడికి దొరికింది.

అయితే ఈ విషయాన్నీ వాళ్ళు 20 సంవత్సరాలుగా ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారు.అప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్న కారణంగా బావిలో పడతారేమోనని చెప్పలేదని ఆయన చెబుతున్నారు.

ఇన్ని సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఆ బావి విషయాన్నీ మీడియాకు చెప్పడంతో వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube