గర్భం దాల్చిన యువకుడు… రిపోర్టులో షాకింగ్ నిజాలు  

మగాడు ప్రెగ్నెంట్ అయినట్లు రిపోర్ట్స్ ఇచ్చిన ల్యాబ్ నిర్వాహకులు. .

Man Pregnant In Madhya Pradesh-

ఈ మధ్య కాలంలో ప్రపంచంలో మన కళ్ళముందు కనిపించే ఆశ్చర్యకర నిజాలు చూసినపుడు కొన్ని టైటిల్స్ వింటే అది వాస్తవమే అయ్యి ఉంటుంది అనుకుంటాం.ప్రకృతి సంబంధమైన బంధాలు కూడా సంబంధం లేకుండా అయిపోతున్న ఇలాంటి తరుణంగా ఓ మగాడు గర్భం దాల్చాడు అంటే కచ్చితంగా షాకింగ్ గా ఉన్న, నిజమనే అనుకుంటాం.

Man Pregnant In Madhya Pradesh--Man Pregnant In Madhya Pradesh-

అయితే అసలు విషయం తెలిసాక మాత్రం డాక్టర్ల నిర్వాకం తెలుస్తుంది.మధ్యప్రదేశ్ లో బిండ్ జిల్లా కూపా ప్రాంతంలో ఓ యువకుడు గర్భం దాల్చిన వ్యవహారం సంచలనంగా మారింది.ఈ వ్యవహారం ల్యాబ్ మోతపడేంత వరకు వెళ్ళింది.

Man Pregnant In Madhya Pradesh--Man Pregnant In Madhya Pradesh-

భిండ్ కి 12 కిలోమీటర్ల దూరంలో గల కూప్ లో శ్యామ్ పాథాలజీ ల్యాబ్ కు 40 ఏళ్ల యువకుడు వచ్చాడు.జ్వరంతో బాధపడుతున్న అతను వైద్యుల సలహా మేరకు ఆ ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నాడు.

వారు ఇచ్చిన రిపోర్టు తీసుకుని వైద్యుల వద్దకు వెళ్లాడు.రిపోర్టు చూసిన వైద్యులు షాక్ అయ్యి అతను గర్భం దాల్చినట్లు రిపోర్టులో రాయబడి ఉందని చెప్పారు.దీంతో రిపోర్టు అందుకున్న యువకుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా సంచలనంగా మారింది.

ఇక ఈ వ్యవహారం కాస్తా వైరల్ కావడంతో స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ వెంటనే ఆ ల్యాబ్ ని సీజ్ చేసి విచారణ మొదలెట్టారు.