చెవిలో విషం పోసుకుని మరణించిన భార్యాభర్తలు.. పిల్లలను కూడా..

ఈ సమాజంలో నెగ్గలేక చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు.కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

 Man Pours Poison Into Wifes Ears, Force Feeds It To Kids Before Ending Own Life,-TeluguStop.com

ఇప్పుడు కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు.ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు.

సరిగ్గా అలాంటి కోవకే చెందిన ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారు.అంతేకాదు పిల్లలకు కూడా విషం పెట్టి చంపాలనుకున్నారు.అయితే చివరి నిముషంలో వారి ప్లాన్ ఫెయిల్ అయ్యింది.పిల్లలు గ్రామస్తులకు విషయమంతా తెలియజేసారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.

తమిళనాడులోని సాలేం పరిధిలోని పుంగావది గ్రామానికి చెందిన వేలుమురుగన్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లితో పాటు నివసిస్తున్నాడు.

అతడు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.అయితే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు.కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.తినడానికి కూడా తిండి లేక చివరకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu Chennai, Story, Ears, Financial, Poison, Tamilandu, Velumuragan-Latest Ne

ఇదంతా చాలక వేలుమురుగన్ తల్లి ఈ పరిస్థితికి నీ భార్యే కారణమని తిట్టడం వల్ల చాలా బాధపడేవాడు.అప్పుడప్పుడు చూడలేక తల్లితో వాధించేవాడు.ఇలాంటి పరిస్థితుల్లో బతకలేమని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకుని పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.తర్వాత ఒక రోజు ఊరి బయటకు పిల్లలను కూడా తీసుకుని వెళ్లారు.ముందుగా పిల్లలకు విషం కలిపినా ఆహారాన్ని తినిపించారు.

తర్వాత భార్యాభర్తలిద్దరూ తమతో తెచ్చుకున్న విషాన్ని ఒకరిచెవులో ఒకరు పోసుకున్నారు.

ఇదంతా గమనించిన పిల్లలు వెంటనే అక్కడి నుండి పరుగులు తీసి గ్రామస్తులకు జరిగిందంతా చెప్పారు.వెంటనే పిల్లలను ఆసుపత్రికి తరలించారు.

తర్వాత భార్యాభర్తలు ఉన్న చోటకు వెళ్లేసరికి అప్పటికే వారు మరణించారు.ప్రస్తుతం పిల్లలు చికిత్స పొందుతున్నారు.

బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, బాలికకు పర్వాలేదని డాక్టర్లు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube