దారుణం : భార్యపై కోపంతో తల్లిలాంటి అత్తను... ఛీ ఈ నీచుడిని ఏం చేసినా తప్పులేదు  

Man Posts Mom-in-law\'s Phone Number On Obscene Portals-obscene Portals,rachakonda Police

ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నతంగా ఆలోచించాలి. కాని కొందరు మాత్రం అత్యంత నీచంగా ఆలోచిస్తూ తాము చదువుకున్న చదువుకు చెడ్డ పేరు తీసుకు వస్తూ ఉంటారు. చదువుకోని వారు మూర్ఖుల్లా ప్రవర్తిస్తే పర్వాలేదు కాని చదువుకున్న వారు కూడా అదే తరహాలో ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు..

దారుణం : భార్యపై కోపంతో తల్లిలాంటి అత్తను... ఛీ ఈ నీచుడిని ఏం చేసినా తప్పులేదు-Man Posts Mom-in-law's Phone Number On Obscene Portals

చదివిన చదువును దృష్టిలో పెట్టుకోని అయినా చేసే పనుల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కాని వరంగల్‌కు చెందిన వ్యక్తి మాత్రం ఆలోచించలేదు. ఉన్నత చదువులు చదివి చిల్లర పని చేయడంతో పరువు పోగొట్టుకోవడంతో పాటు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… వరంగల్‌కు చెందిన సునీల్‌ అనే 33 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఉద్యోగరీత్య వైజాగ్‌లో సెటిల్‌ అయ్యాడు. వైజాగ్‌లో ఈయన గారి వ్యవహారం నచ్చక పోవడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో అతడు సైకోలా మారిపోయాడు.

ఆమెను రమ్మంటే రానంటూ మొండికేయడంతో తన అత్త ఆమెతో ఇలా చెప్పిస్తుందని అతడికి అనుమానం కలిగింది. ఆ అనుమానంతో అత్తపై కక్ష సాధించాలని భావించాడు. అందుకోసం చాలా ఆలోచించి ఆమె ఫోన్‌ నెంబర్‌ను ఒక వ్యభిచారి అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజులుగా ఆమెకు తరచుగా ఫోన్‌ కాల్స్‌ వస్తూ ఎంత, ఎక్కడకు రావాలి అంటూ కుర్రాళ్లు అశ్లీలంగా మాట్లాడటం జరుగుతుంది. దాంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. చివరకు ఇక తట్టుకోలేక రాచకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎంక్వౌరీ చేయగా ఒక అశ్లీల వెబ్‌ సైట్‌ లో ఆమె ఫోన్‌ నెంబర్‌ను సునీల్‌ పోస్ట్‌ చేశాడని, అందువల్లే ఆమెకు అశ్లీల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని పోలీసులు నిర్ధారించి సునీల్‌ను అరెస్ట్‌ చేయడం జరిగింది.

కాస్త ఓపికతో ఉంటే సంసారం చక్కబడేదేమో, ఓపిక లేకుండా తల్లిలాంటి అత్తను అవమానించే ఉద్దేశ్యంతో తన జీవితంను నాశనం చేసుకున్నాడు.