డేటింగ్ యాప్ లతో ఎరవేసి ఆపై...

అంతర్జాల ప్రపంచం, చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత యువతరం నిత్యం దానితోనే కాపురం చేస్తున్నారు.ఒకప్పుడు ఎక్కువ సమయం ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి, ఆపై ఫ్యామిలీతో గడపడానికి ఇచ్చే యువతరం ఇప్పుడు ఖాళీ దొరికితే స్మార్ట్ ఫోన్ కి అతుక్కుపోతున్నారు.

 Man Posed As Woman To Lure Men On Dating Apps Onlinedating-TeluguStop.com

ఇదే ఇప్పుడు వారి పాలిత శాపంగా మారుతుంది.యవతరం వీక్ నెస్ ని అవకాశంగా వాడుకొని అంతర్జాలం ద్వారా మోసాలకి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది.

ఆన్ లైన్ వేదికగా మోసం చేసే వారికి యువత కూడా అడ్డంగా దొరికిపోతూ తరువాత తీరిగ్గా చిన్తిస్తున్నారు.ఇప్పుడు డేటింగ్ యాప్‌ల ద్వారా తనను తాను యువతిగా పరిచయం చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఓ యువకుడు ఘటన వెలుగులోకి వచ్చింది.

నార్త్ కాలిఫోర్నియాకు చెందిన 20 ఏళ్ల హకీం డొపార్కర్ అనే యువకుడు ఇలా దోపిడీలకు పాల్పడుతున్నట్లు కాంట్రా కొస్తా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ పోలీస్ అధికారులు వెల్లడించారు.యాప్స్‌లో అందమైన యువతుల ఫొటోలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి డొపార్కర్ వల వేసేవాడు.

అతని వలలో చిక్కుకున్న వారిని శాన్ ఫ్రాన్సిస్కొకు 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంటియోచ్ అనే ప్రాంతానికి పిలిచేవాడు.ఆ తరువాత అమ్మాయిని కలవచ్చని ఆశగా అక్కడికి వెళ్ళిన వారిని వెనక నుంచి మేడపై కత్తి పెట్టి బెదిరించి తెచ్చిన నగదు, వాహనాల తాళాలు అడిగి బలవంతంగా లాక్కునేవాడు.

అతని వలలో చిక్కుకున్నవారు కూడా భయపడి అతను అడివినవి ఇచ్చేసేవారు.దీంతో వాటిని తీసుకొని అక్కడి నుంచి అతను ఉడాయించేవాడు.ఇలా జూన్‌ నెలలో నలుగురిని బెదిరించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, రెండు కార్లను ఎత్తుకెళ్లాడు.దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డొపార్కర్‌ను ఆంటియోచ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube