యూకే: భారతీయుడి హత్య, నాకేం తెలియదన్నాడు.. సీసీ ఫుటేజ్‌తో బయటపడ్డ నేరం

గతేడాది మార్చిలో లండన్‌లో భారత సంతతి వ్యక్తి హత్యకు తానే కారణమని మరో భారతీయ యువకుడు నేరాన్ని అంగీకరించాడు.ఐస్‌వర్త్ క్రౌన్ కోర్టులో రెండో రోజు విచారణ సందర్భంగా తాను బల్జిత్ సింగ్‌ (37)ను హత్య చేసినట్లు మన్‌ప్రీత్ సింగ్ (21) తన నేరాన్ని అంగీకరించినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

 Man Pleads Guilty To Indian-origin Man's Murder In Uk, Iceworth Crown Court, Bal-TeluguStop.com

పశ్చిమ లండన్‌లోని హేస్ ప్రాంతంలో నివసించే బల్జిత్ గతేడాది ఏప్రిల్ 25న స్టేషన్‌ రోడ్‌‌లో శవమై తేలాడు.దీంతో మెట్ పోలీస్ విభాగంలోని స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

మన్‌ప్రీత్ చేతిలో బాధితుడు పదే పదే దాడికి గురయ్యాడని.అందువల్లే బల్జిత్ ప్రాణాలు కోల్పోయాడని డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ ఆడమ్ గుట్రిడ్జ్ చెప్పారు.

ఆరోజు సాయంత్రం మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించడం వల్లే బల్జిత్ తనను తాను రక్షించుకోలేకపోయాడని ఆయన అభిప్రాపడ్డారు.ఇదే సమయంలో మన్‌ప్రీత్ ఆ స్థితిని అదనుగా చేసుకుని తీవ్రమైన భౌతికదాడితో హతమార్చాడని గుట్రిడ్జ్ పేర్కొన్నారు.

అయితే బల్జిత్‌, మన్‌ప్రీత్‌లు ఉపాధి అన్వేషణలో భాగంగా బర్మింగ్‌హామ్ నుంచి లండన్‌కు కలిసి ప్రయాణించడంతో పాటు కొన్నాళ్లు ఒకే రూమ్‌లో వున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.అయితే బల్జిత్ హత్యకు కొన్ని రోజుల ముందు వీరిద్దరూ ఏవో కారణాలతో విడిపోయారు.

నాటి నుంచి మద్యానికి పూర్తిగా బానిసైన మన్‌ప్రీత్ తన మరో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పైనే జీవిస్తున్నాడు.హత్య జరిగిన రోజు సాయంత్రం మన్‌ప్రీత్, అతని స్నేహితుడు, బల్జిత్ కలిసి హేస్‌లోని ఉక్స్‌బ్రిడ్జి రోడ్‌లో ఓ చోట పీకలదాకా మద్యం సేవించారు.

అనంతరం ముగ్గురు తమ ఇళ్లకు బయల్దేరారు.సీసీటీవీ ఫుటేజ్‌లో వారు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.వీటిలో బల్జిత్ మత్తులో నిలబడటానికే ఇబ్బంది పడుతున్నాడు.మన్‌ప్రీత్, బల్జిత్ స్టేషన్‌ రోడ్‌కు దూరంగా వున్న ఓ రహదారిలోకి ప్రవేశించిన తర్వాత.ఆకస్మాత్తుగా బల్జిత్‌పై మన్‌ప్రీత్ విరుచుకుపడ్డాడు.

45 నిమిషాల తర్వాత అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి రక్తపు మడుగులో బల్జిత్ మృతదేహాన్ని గుర్తించాడు.వెంటనే అతను లండన్ అంబులెన్స్ సర్వీస్‌, పోలీసులకు సమాచారం అందించాడు.పోస్ట్‌మార్టం నివేదికలో బల్జిత్ మెడ ఎముకలు, పక్కటెముకలు విరిగిపోవడంతో పాటు శరీరంలోని సున్నిత ప్రాంతాల్లో 20 గాయాలు అయ్యాయని తేలింది.

రంగంలోకి దిగిన పోలీసులు మన్‌ప్రీత్‌ను అరెస్ట్ చేశారు.అయితే తొలుత తాను ఆ సమయంలో బల్జిత్‌ పక్కన లేనని మన్‌ప్రీత్ బుకాయించే ప్రయత్నం చేశాడు.అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అతని ముందు పెట్టడంతో మన్‌ప్రీత్ నేరాన్ని అంగీకరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube