ఉక్కపోత భరించలేక విమానం విండో డోర్‌ ఓపెన్‌ చేసిన ప్రయాణికుడు.. సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాడు

విమాన ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఉత్సాహంను ఇస్తుంది.ముఖ్యంగా మొదటి సారి విమానంలో ప్రయాణించే వారికి అత్యంత వింతగా, కొత్త అనుభవం కలుగుతుంది.

 Man Opens Aeroplane Emergency Window-TeluguStop.com

విమానంలో రెగ్యులర్‌ గా ప్రయాణించే వారు మామూలుగా వెళ్తారు.కాని కొత్తగా ప్రయాణించే వారు మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం.

తాజాగా ఒక ప్రయాణికుడు బెంగళూరు ఎయిర్‌ పోర్ట్‌లో చేసిన పనికి విమాన సిబ్బంది, మరియు ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు గందరగోళంకు గురయ్యారు.అతడు తెలియక చేసిన పనికి ఆగం ఆగం అయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బెంగళూరుకు చెందిన సునీల్‌ అనే యువకుడు బెంగళూరు నుండి లక్నో వెళ్లేందుకు గాను గో ఎయిర్‌ సర్వీస్‌కు చెందిన విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు.

మొదటి సారి విమాన ప్రయాణం అవ్వడంతో అతడు చాలా ఉత్సాహంగా విమనం ఎక్కాడు.విమానం ఎక్కిన తర్వాత దాదాపు అర్థ గంట పాటు అలాగే కూర్చుండబెట్టారు.

ఇంకా టైం పట్టేలా అతడికి అనిపించింది.లోపల గాలి తలగడం లేదు, ఉక్క పోతగా ఉండటంతో తాను కూర్చున్న సీటు పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్‌ చేశాడు

ఆ డోర్‌ అత్యంత ప్రమాధకర స్థితిలో అంటే విమానం క్రాష్‌ ల్యాండ్‌ అవుతున్న సమయంలో మాత్రమే ఓపెన్‌ చేయాలి.

అలాంటిది అతడు ఓపెన్‌ చేయడంతో ప్రయాణికులతో పాటు, విమాన సిబ్బంది అంతా కూడా గందరగోళంకు గురి అయ్యాడు.అప్పుడు విమానం టేకాఫ్‌ కాలేదు కనుక ప్రమాదం ఏమీ జరుగలేదు.

అదే టేకాఫ్‌ లో ఉన్న సమయంలో అతడు అలా చేసి ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ అంతా టెన్షన్‌ పడ్డారు.వెంటనే అతడిని కిందికి దించి విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు.

అతడు వెళ్లవల్సిన విమానం వెళ్లి పోయింది.దాదాపు రెండు గంటల పాటు అతడిని విచారించిన పోలీసులు అతడు ఏ ఉద్దేశ్యంతో డోర్‌ తీశాడో ప్రశ్నించారు

మొదటి సారి విమాన ప్రయాణం అవ్వడం వల్ల తనకు పూర్తిగా తెలియదు అని, గాలి రావడం లేదనే ఉద్దేశ్యంతోనే తాను విండో డోర్‌ తీసినట్లుగా చెప్పుకొచ్చాడు.

మొదటి సారి కనుక అతడిని క్షమించి వదిలేయడం జరిగింది.కేసు నమోదు చేయకుండా తదుపరి విమానంలో అతడిని పంపించారు.

ఈ సంఘటనతో తమ ప్రయాణికులు భయాందోళనకు గురి అవ్వడంతో గోఎయిర్‌ సంస్థ వారికి క్షమాపణలు చెప్పింది.ఇలాంటివి మళ్లీ జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube