అంకుల్ మా నాన్నను వాడే చంపాడు చిన్నారి రోదన..! బహిరంగంగా మూత్రవిసర్జన చేయొద్దు అన్నందుకు ఆ నీచుడు!

క్షణికావేశం ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.ఇంటి ముందు రోడ్డుపై మూత్రం ఎందుకు పోస్తున్నావని ప్రశ్నించిన వృద్ధురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఈ తీరును ప్రశ్నించిన మనవడిని కత్తితో పొడిచి చంపాడో వ్యక్తి! ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ముల్కలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

 Man Objects To Public Urination Gets Beaten To Death In Mahabubabad-TeluguStop.com

‘‘అంకుల్‌.మా నాన్నను చంపేశాడు.కిందపడి రక్తపు మడుగులో కొట్టుకుంటున్న మా నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదంకుల్‌…’’ ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.పోలీసుల కథనం ప్రకారం.

కోదాటి ఉపేందర్(33), నగరంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో మేదరబజార్‌లో నివసిస్తున్నాడు.అతని ఇంటికి దగ్గరలోని అతని నాయనమ్మ కోదాటి వెంకమ్మ కూడా నివసిస్తోంది.

ఈ క్రమంలో వెంకమ్మ ఇంటి ఎదుట అదే ప్రాంతానికి చెందిన యరగాని శ్రీనివాస్ అనే వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుండడంతో తన ఇంటి ఎదుట మూత్ర విసర్జన ఎందుకు చేస్తున్నావని వెంకమ్మ శ్రీనును ప్రశ్నించడంతో అతను వెంకమ్మను బూతులు తిట్టాడు.

శనివారం ఇంటి వద్దనే ఉన్న తన మనవడైన ఉపేందర్‌తో ఆమె ఈ విషయం చెప్పింది.ఆమెను వెంటబెట్టుకుని, పక్క వీ«ధిలోనే ఉన్న యర్రగాని శ్రీను వద్దకు ఉపేందర్‌ వెళ్లాడు.తన నానమ్మను ఎందుకు తిట్టావని ప్రశ్నించాడు.

అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న శ్రీను, ఉపేందర్‌ను దుర్భాషలాడుతూ మీదకు వచ్చాడు.తన వద్దనున్న కత్తితో ఉపేందర్‌ గుండెల్లో బలంగా పొడిచాడు.

తీవ్ర రక్తస్రావంతో ఉపేందర్‌ కింద పడిపోయాడు.

స్థానికులు ఉపేందర్‌ను ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచాడు.

ఈ సంఘటనతో మేదరబజార్‌లో అలజడి చెలరేగింది.మృతుని నాయనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బర్పటి రమేష్ పేర్కొన్నారు.

నిందితుడు శ్రీను వన్‌టౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఉపేందర్‌ పెద్ద కుమారుడైన చిన్నారి తనిష్, ఆస్పత్రిలో గుండె పగిలేలా రోదిస్తున్నాడు.

‘‘మా నాన్నను ఆ అంకుల్‌ చంపేశాడు.మా నాన్న ఇంకా రాలేదని వెళ్లాను.

నాన్న పడిపోయాడు.రక్తం కారుతోంది.

నాకు భయమేసింది.పరిగెత్తుకొంటూ మా అమ్మను తీసుకొచ్చాను…’’ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ చిన్నారి చెప్పిన విషయమిది.

‘‘పొట్టకూటి కోసం… బతకటానికి ఖమ్మం వచ్చాం.మేమిప్పుడు ఎలా బతకాలి దేవుడా…?’’ అని, తన ఇద్దరు పిల్లలను పొదివి పట్టుకుని గుండె బాదుకుంటూ రోదిస్తోంది స్వాతి.ఆ ముగ్గరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube