దేవుడా.. 18 మాసాలుగా టాయ్ లెట్ కి వెళ్ళని వ్యక్తి..!

సాధారణంగా మూడు పూటలా ఆహారం తీసుకునే ప్రతి వ్యక్తి వారంలో 7-9 సార్లు మలవిసర్జన కి వెళ్తాడు.రోజులో ఒకసారి కూడా మలవిసర్జన కి వెళ్లకపోతే అతనికి ఏదో ఒక రోగం ఉంటుందని వైద్యులు చెబుతుంటారు.

 Man Didn't Went To Toilet From 18 Months, Toilet , Rare Disease, Madhya Pradesh,-TeluguStop.com

అలాంటిది ఒక 16 ఏళ్ల యువకుడు దాదాపు 18 నెలలుగా టాయిలెట్ కి వెళ్లిన దాఖలాలే లేవట.కానీ ప్రతి రోజూ 18 నుంచి 20 రొట్టెలు కడుపు నిండా లాగించేస్తాడట.

బాత్ రూమ్ కి వెళ్లకపోతే కడుపు ఉబ్బి ప్రాణం పోయే పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకుంటారు కానీ అతని విషయంలో మాత్రం అటువంటిదేమీ జరగలేదు.వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు పరీక్షించిన డాక్టర్లు కూడా ఈ మెడికల్ కేసు ఏంటో అసలు అర్థం కాలేదట.

పూర్తి వివరాలు తెలుసుకుంటే… మధ్యప్రదేశ్ రాష్ట్రం మురౌనా జిల్లాకి చెందిన మనోజ్ చాందిల్ కుమారుడు ఆశీష్ గత 18 నెలలుగా బాత్రూం కి వెళ్లడం లేదు.18 నెలల్లో మలమూత్రాలను విసర్జించలేదట.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని వైద్యుల వద్దకు తీసుకు వెళ్లారట.అయితే చాలా టెస్టులు చేసిన తర్వాత ఆశీష్ కి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని.

సంపూర్ణ ఆరోగ్యవంతుడు గానే ఉన్నాడని తేల్చారట.కానీ బాత్ రూమ్ కి వెళ్ళాక పోవడానికి ఏం కారణం అయ్యి ఉంటుందో తేల్చలేకపోయారట.

ఆహారం తీసుకొని కూడా మలమూత్రాలకు వెళ్ళని కేసులను తాము ఎక్కడా చూడలేదని.ఇది ఏ వ్యాధో కూడా తమకు తెలియడం లేదని ప్రతి ఒక్క డాక్టర్ చెప్పి ఆశిష్ కుటుంబ సభ్యులను తిరిగి పంపించారట.

కడుపులో పేరుకుపోయిన వ్యర్థం ఏదో ఒక రకంగా బయటకు రావాల్సిందే.కానీ ఆశిష్ శరీరంలో అలా జరగడం లేదు.దీంతో తమ కొడుకుకి ఉన్న వ్యాధి ఏంటో అర్థం కాని తల్లిదండ్రులు ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి తిరుగుతూ.తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు.

ఇంతవరకు ఏ వైద్యులు కూడా ఆశీష్ కి వచ్చిన జబ్బు ఏంటో చెప్పలేకపోతున్నారు.ఈ విచిత్రమైన కేసు ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా అందరిని విస్తుపోయేలా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube